25మందిని ట్రాన్స్‌ఫర్ చేసిన సిపి మహేష్ భగవత్
హైదరాబాద్ : రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తు సిపి మహేష్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 25మంది ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్స్‌స్పెక్టర్లకు స్థానచలనం కల్పించారు. హయత్‌నగర్ ఎస్‌హెచ్‌ఓ సురేందర్‌ను సైబర్ క్రైం, మేడిపల్లి ఎస్‌హెచ్‌ఓ అంజిరెడ్డి ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి ఇన్స్‌స్పెక్టర్‌గా బదిలీ చేశారు. ఇటీవల ఓ భూమి విషయంలో కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించడంతో హయత్ నగర్ పిఎస్‌లో ఎస్సైగా పనిచేస్తున్న శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. దీంతో పలు ఆరోపణలు వినిపించాయి, పై అధికారి అనుమతి లేకుండా ఎస్సై ఎలాగా కల్పించుకున్నాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆరోపణలు వచ్చిన అధికారులపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వేటువేశారు. సివిల్ తగాదాల్లో కల్పించుకుంటే చర్యలు తప్పవని పోలీసులకు సిపి మహేష్ భగవత్ హెచ్చరిక పంపారు.