Monday, January 20, 2025

సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో భారీ కుదుపులు… ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం భారీ కుదుపులకు గురి కావడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో 30 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఈనెల 20న మొత్తం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో బ్రిటన్ రాజధాని లండన్ నుంచి సింగపూర్‌కు చెందిన విమానం (ఎస్‌క్యు 321) బయలుదేరింది.

మార్గమధ్యలో విమానం తీవ్ర కుదుపులకు లోను కావడంతో దాన్ని థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ లోని సువర్ణభూమి విమానాశ్రయానికి మళ్లించారు. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 30 మంది గాయపడ్డారని సమాచారం. మృతుని కుటుంబానికి సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. ప్రయాణికులకు అదనపు వైద్య సాయం అందించేందుకు థాయ్‌లాండ్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించింది. అదనపు సాయం అవసరమైతే అందించడానికి బ్యాంకాక్‌కు ఓ బృందాన్ని పంపుతున్నామని తెలియజేసింది.

సహజంగా ప్రయాణికులు సీల్ట్ బెల్ట్ ధరించక పోవడం వల్లనే అలాంటి గాయాలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. విమానంలో కుదుపులు ఏర్పడతాయని వెదర్ రాడార్ సూచించక పోవడం వల్ల పైలట్ ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలు చేయలేక పోయారని అధికారులు తెలిపారు. ఇలాంటి సందర్భాలలో ప్రయాణికులు కుదుపులకు కాక్‌పిట్ లోకి నెట్టివేయబడతారని, గాయాలకు దారి తీస్తాయని అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది మే నెలలో ఢిల్లీ సిడ్నీ ఎయిర్ ఇండియా విమానంలో ఇదే విధంగా కుదుపులు ఎదురయ్యాయి. అనేక మంది ప్రయాణికులు గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News