Tuesday, January 7, 2025

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

మెండోరా : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతం మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి 2,50,000 వేల క్యూసెక్కుల భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు 26 వరద గేట్ల ద్వారా 1,50,000 వేల క్యూసెక్కులు,ఎస్కేప్ గేట్ల ద్వారా 4000 వేల క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదలడం జరుగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు 90 టీఎంసీల ఉండగా గురువారం సాయంత్రం వరకు 1088.20 అడుగులు 77.063 టీఎంసీలుగా ఉందని ప్రాజెక్టు ఏ.ఈ.ఈ. వంశీ తెలిపారు.

మంచి నీటి అవసరాలకు మిషన్ భగీరథ ద్వారా 152 క్యూసెక్కులు ,ఆవిరి రూపంలో 595 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామన్నారు. గత ఏడాది ఇదే రోజున ప్రాజెక్టు నీటిమట్టం 1087.60 అడుగులు 75.146 టీఎంసీలుగా ఉందని 1 జూన్ నుండి ఇప్పటివరకు 55.873 టిఎంసీల నీరు వచ్చి చేరింది.1 జూన్ నుండి ఇప్పటివరకు 3.709 టిఎంసీ ల నీరు విడుదల చేశామని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News