Friday, November 22, 2024

సాగర్ జలాశయానికి వరద ఉధృతి..

- Advertisement -
- Advertisement -

Heavy water inflow into Sagar after open srisailam gates

నల్లగొండ: నాగార్జున సాగర్ జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతున్నది. శ్రీశైలం గేట్లు ఎత్తడంతో 5లక్షల 30వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా సాగర్ కు వస్తుంది. దీంతో సాగర్ డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా 569 అడుగులకు చేరుకున్నది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312టిఎంసిలు కాగా, ప్రస్తుతం 233 టిఎంసిల నీరు వచ్చి చేరింది. మరో 48 గంటల్లో జలాశయo గరిష్ట నీటి మట్టనికి చేరుకునే అవకాశం ఉండడంతో డ్యామ్ క్రస్ట్ గేట్లు ఎత్తేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలుగే, గేట్ల మరమ్మతులు కూడా పూర్తి చేసి.. దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. భారీగా వరద వస్తున్నందున డ్యామ్ వేగంగా నిండుతున్నదని క్రస్ట్ గేట్లు ఎత్తేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డ్యామ్ ఎస్ఇ ధర్మా నాయక్ తెలిపారు.

Heavy water inflow into Sagar after open srisailam gates

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News