Friday, November 15, 2024

నిండుతున్న శ్రీశైలం

- Advertisement -
- Advertisement -

Heavy Water Inflow into Srisailam Project
కృష్ణకు తోడైన తుంగభద్ర వరద
జలాశయంలోకి భారీగా నీరు
శ్రీశైలం నీటిమట్టం 885అడుగులు
మంగళవారం సాయంత్రానికి 877 అడుగులు

కృష్ణానది ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణమ్మకు వదర తాకిడి యధావిధిగా కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి జూరాల ప్రాజెక్టు 31 గేట్లు ఎత్తి 3లక్షల క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 15వేల క్యూసెక్కులు వదులుతున్నారు. తుంగభద్రా నది పైగల సుంకేసుల డ్యాంగేట్లను మంగళవారం ఉదయం నుంచి అధికారులు క్రమక్రమంగా ఎత్తుతూ మొత్తం 30 గేట్లను ఎత్తి దిగువ శ్రీశైలంకు 90వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.శ్రీశైలం జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గానూ మంగళవారం సాయంత్రం 6 గంటలకు అధికారికంగా జారీ చేసిన సమాచారం మేరకు 877 అడుగులకు చేరుకుంది.

మనతెలంగాణ/హైదరాబాద్: ఎగువనుంచి వస్తున్న భారీ వరద ప్రవాహాలతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం వేగంగా పెరుగుతూ వస్తోంది. ప్రాజెక్టులో నీటి నిలువలు గరిష్టస్థాయికి చేరువకావస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకుని గురువారం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు ప్రాజెక్టు నీటివిడుదల ప్రోటోకాల్‌ను నిశితంగా పరిశీలిస్తున్నారు.ప్రస్తుతం వస్తున్న వరద ప్రవాహం మరింత అధికమయితే అంతకు ముందే గేట్లు తెరిచే అవకాశం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,98,288క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 855అడుగులకు గాను, ఇప్పటికే నీటిమట్టం 876అడుగులకు చేరుకుంది. మరో 54టిఎంసిల నీరు చేరుకుంటే ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకోనుంది. జలాశయంలో పూర్తి స్థాయి నీటినిలువ సామర్ధం 215టిఎంసిలు కాగా ఇప్పటివరకూ 172.66టింఎంసిల నీరు నిలువ ఉంది. ఎగువ నుంచి వస్తున్న నీటిలో 35315క్యూసెక్కుల నీటిని జలాశయం నుంచి బయటకు విడుదల చేస్తున్నారు.

జలాశయం ఇప్పటికే 80శాతం నిండినట్టు అధికారులు వెల్లడించారు. కృష్ణానది పరివాహకంగా ఎగువన కర్ణాటకలో వర్షాలు కురుస్తున్నందున ఆల్మట్టి జలాశయంలోకి 3,92,778క్యూసెక్కుల వదర ప్రవాహం చేరుతోంది. ఆల్మట్టి జలాశయంలో 80.83టింఎసిల నీటిని నిలువ వుంచి, మిగిలిన 18శాతం ఖాళీ ఉంచుతున్నారు.ఎగువ నుంచి వస్తున్ననీటిలో 3లక్షల క్యూసెక్కుల నీటిని జలాశయం నుంచి బయటకు విడుదల చేస్తున్నారు. దిగువన నారాయణ పూర్ జలాశయ ద్వారా 3,05,800క్యూసెక్కుల నీరు బయటకు విడుదలవుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టులో నీటి మట్టం పెరగకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారు. ఎగువనుంచి ప్రాజెక్టులోకి 3,28,600క్యూసెక్కుల నీరు చేరుతోంది. జలాశయంలో 27శాతం కుషన్ ఉంచి 3,12,195క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు.
టిబిడ్యాం గేట్లు ఎత్తివేత.. తుంగభద్రకు భారీ వరద
ఎగువనుంచి తుంగభద్ర ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 1633అడుగులు కాగా, ఇప్పటికే 1631.87అడుగుల స్థాయికి నీరు చేరింది. పూర్తి స్థాయి 100.86టిఎంసిల నీటినిలువకుగాను, ప్రస్తుతం 96.53 టిఎంసిల నీరు నిలువ ఉంది. ఎగువనుంచి తుంగభద్ర జలాశయంలోకి 1,08,819క్యూసెక్కుల నీరు చేరుతుండగా ప్రాజెక్టు 33గేట్లు ఎత్తేశారు. జలాశయం నుంచి 78872క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. దీంతో తుంగభద్ర డ్యాంకు దిగువన నదిలో వరద ప్రవాహ ఉధృతి పెరిగింది. నదికి ఇరువైపులా ఇటు తెలంగాణ, అటు ఎపికి చెందిన రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు తుంగభద్ర నదికి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నదిలోకి చేపల వేటపై ఆంక్షలు విధించారు. నదిదాటే ప్రయత్నాలు చేవయద్దని, మంత్రాలయం దిగువన లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Heavy Water Inflow into Srisailam Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News