Friday, November 15, 2024

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..

- Advertisement -
- Advertisement -

Heavy Floods in Srisailam Project

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి మళ్ళీ వరద నీరు పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 1,31,833 క్యూసెకులు ఉండగా, ఔట్ ఫ్లో మాత్రం 57,514 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 874.50 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా, ప్రస్తుతం 161. 2918 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోగా.. ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ నెల ఆరంభంలోనే తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాజెక్టులు నిండుకున్న విషయం తెలిసిందే.

Heavy Water Inflow into Srisailam Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News