Monday, November 25, 2024

వడగండ్ల భీభత్సం..

- Advertisement -
- Advertisement -

పెంచికల్‌పేట్‌ః మండలంలో అదివారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం భీభత్సం సృష్టించింది. ముఖ్యంగా యాసంగి పంటలో సాగు చేస్తున్న రైతులకు నిరాశే ఎదురైంది. వర్షపు రాళ్లతో కూడిన భారీ వర్షం పడడంతో కోత దశలో ఉన్న వరి పోలాలు నేలమట్టం అయి, వడ్లు రాలిపోయాయి. అలాగే మొక్కజోన్న పంట దెబ్బతిన్నది. అకస్మత్తుగా కురిసిన అకాల వర్షంతో మండలంలోని రైతులు అందోళన చెందుతున్నారు. మండలంలోని దరోగపల్లి గ్రామానికి చెందిన గోలుసుల పుల్లక్క, రెడ్డి సీను, సోమన్కర్ పోషన్నలకు చెందిన ఇంటిపై కప్పు గాలి భీభత్సానికి కొట్టుకోపోయాయి.

మరోకరి ఇంటిపై చెట్టు విరిగి పడడంతో ఇళ్లు కూలింది. అలాగే కూలిన రేకులు రైతుకు చెందిన ఎడ్లపై పడడంతో ఎడ్లకు గాయాలయ్యాయి. మండలంలోని అంగన్‌వాడి సెంటర్‌లకు సరఫరా చేసే కోడిగుడ్ల వాహనంతో రాళ్ల వర్షం కురవడంతో కోడిగుడ్లు పగిలిపోయాయి. మండలంలో గాలి వాన భీభత్సనికి పలు గ్రామాల్లో చెట్లు విరిగి కరెంట్ లైన్‌లపై పడడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. మండల కేంద్రంలో కూలిన చెట్లను జెసిబి సహాయంతో ఎస్‌ఐ విజయ్ తోలగించారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంటలు పరిశీలించి తమకు న్యాయం చేయాలని రైతులు కొరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News