హైదరాబాద్: మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ కు చెందిన రోజువారీ ఫాస్ట్ ఫ్యాషన్ ఫుట్‌వేర్ బ్రాండ్, వాక్‌వే, హైదరాబాద్‌లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ స్టోర్‌లో తన తాజా కలెక్షన్ ఆవిష్కరించింది. తమిళం, తెలుగు, కన్నడ సినిమాల్లో తన ఆకర్షణీయమైన నటనతో దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్ ఈ ఆవిష్కరణ కార్యక్రమంకు హాజరయ్యారు.
వాక్‌వే యొక్క కొత్త కలెక్షన్ శైలి, సౌకర్యానికి విలువనిచ్చే యువ మిలీనియల్స్ అవసరాలను తీర్చడానికి రూపొందించబడింది. హెబ్బా కు పాదరక్షల సేకరణ పట్ల మంచి ఆసక్తి ఉంది. ఆమె సరికొత్త, గొప్ప డిజైన్‌ల కోసం ఎప్పుడూ వెతుకుతూ ఉంటుంది. ఆమె రీడెమ్ స్టోర్‌ను తరచుగా సందర్శిస్తుంటారు. వాక్‌వే కలెక్షన్ పై తనకున్న ప్రేమ గురించి హెబ్బా మాట్లాడుతూ.. “నేను ఎల్లప్పుడూ ఖచ్చితమైన పాదరక్షల కోసం వెతుకుతూ ఉంటాను. వాక్‌వే నన్ను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విఫలం కాదు. ప్రతి జత స్టైలిష్‌గా, సౌకర్యవంతంగా మరియు సరసమైనదిగా కనిపిస్తుంది, వినియోగదారులు కేవలం ఒక జతను కలిగి ఉండకుండా అనేక జతల షూలను తీసుకోవచ్చు” అని అన్నారు.
“హైదరాబాద్‌లో మా కొత్త కలెక్షన్‌ను విడుదల చేయటంలో భాగంగా హెబ్బాతో చేతులు కలిపినందుకు మేము సంతోషిస్తున్నాము. మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్‌లో, మా కస్టమర్ల పల్స్‌ని అర్థం చేసుకోవడంతో పాటుగా వారి అంచనాలను అందుకోవటానికి ప్రయత్నిస్తున్నాము. మా తాజా సేకరణ ఈ నిబద్ధతను నొక్కి చెబుతుంది, యువ మిలీనియల్స్, ఫ్యాషన్ ఫార్వర్డ్ కస్టమర్‌లకు అందించే స్టైలిష్, సరసమైన ఉత్పత్తులను అందిస్తున్నాము” అని దీపికా దీప్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ – మార్కెటింగ్, మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ అన్నారు.
పురుషులు, మహిళలు ఇద్దరికీ పాదరక్షల యొక్క బహుళ ఎంపికలను వాక్‌వే అందిస్తుంది. వాక్‌వే యొక్క వివిధ రకాల లోఫర్‌లు, ఆక్స్‌ఫర్డ్‌లు, ఫ్లోటర్‌లు, ఫ్లిప్‌ఫ్లాప్స్, శాండల్స్, స్నీకర్‌ల నుండి పురుషులు ఎంపిక చేసుకోవచ్చు. మహిళలు శాండల్స్, స్టిలెట్టోస్, వెడ్జెస్, బ్లాక్ హీల్స్, పంపులు, పీప్ టోలు, స్నీకర్లు, ఫ్లిప్ ఫ్లిప్స్, బాలేరినాస్, ఫ్లాట్‌లు లేదా బూట్‌లు అన్నీ ఎంపిక చేసుకోవచ్చు. ఆకర్షణీయమైన ధరలు, వేగంగా కదిలే డిజైన్‌లు వాక్‌వేని పాదరక్షల గమ్యస్థానంగా మార్చాయి.
వాక్‌వే స్టోర్‌లో, హెబ్బా స్టోర్ కలియ తిరుగుతూ కొత్త కలెక్షన్ నుండి పాదరక్షలను చూడటం కనిపించింది. హెబ్బా పటేల్ అభిమానులు ఆమెను కలుసుకోవడం, సంభాషించడమే కాకుండా వాక్‌వే స్టోర్‌లో వివిధ రకాల ఇంటరాక్టివ్ గేమ్‌లు, పోటీలను ఆడి బహుమతులు గెలుచుకున్నారు.