Monday, December 23, 2024

రాజ్‌కోట్‌లో చెక్‌డ్యామ్‌కు హీరాబెన్ పేరు..

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: గుజరాత్‌లోని రాజ్‌కోట్ శివారులో నిర్మితమవుతున్న చెక్‌డ్యామ్‌కు ప్రధాని మోడీ మాతృమూర్తి దివంగత హీరాబెన్ పేరు పెట్టారు. ఈ విషయాన్ని శుక్రవారం అధికారవర్గాలు తెలిపాయి. చెక్‌డ్యామ్‌ను రూ.15లక్షల వ్యయంతో గిర్ గంగా పరివార్ ట్రస్ట్ నిర్మిస్తుంది. రాజ్‌కోట్‌ కల్వాద్ రోడ్డులోని వగుదాద్ గ్రామంలో న్యారి నది ప్రవాహంపై చెక్ డ్యామ్ నిర్మిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షుడు సాఖియా తెలిపారు.

ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ పేరిట హీరాబా స్మృతి సరోవర్‌గా చెక్ డ్యామ్ పేరుపెట్టినట్లు తెలిపారు. తమ ట్రస్ట్ గత నాలుగు నెలలకాలంలో దాతల సాయంతో 75చెక్ డ్యామ్‌లు నిర్మించినట్లు వివరించారు. కాగా హీరాబెన్ 30న అహ్మదాబాద్ ఆసుపత్రిలో కన్ను మూశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News