Tuesday, March 4, 2025

రష్యాకు వ్యతిరేకంగా సైబర్ సమరం ఆపండి : అమెరికా రక్షణశాఖ ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అధికారం లోకి వచ్చిన దగ్గర నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యాకు అనుకూల వైఖరిని ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ రష్యాకు వ్యతిరేకంగా చేపడుతోన్న సైబర్ కార్యకలాపాలన్నీ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నిలిపివేత ఎంతకాలం కొనసాగుతుందన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. ఈమేరకు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ఉక్రెయిన్ష్య్రా మధ్య మూడేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని నిలువరించేందుకు మధ్యవర్తిగా ట్రంప్ వ్యవహరిస్తున్నారు.

అయితే ఈ విషయంలో పుతిన్‌కు అనుకూలంగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని నిందిస్తుండటం చర్చనీయాంశ అవుతోంది. ఇటీవల జెలెన్‌స్కీతో శ్వేతసౌధంలో జరిగిన భేటీలో కూడా మీడియా ఎదుటే వాగ్వాదానికి దిగడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచింది. ఈ క్రమంలో రష్యా విషయంలో అమెరికా అనుసరిస్తోన్న విధానాలను ట్రంప్ యంత్రాంగం పునః సమీక్షిస్తున్నట్టు తాజాగా ఓ కథనం వెలువడింది. దీనిపై స్పందించేందుకు పెంటగాన్ నిరాకరించింది. సైబర్ ఇంటెలిజెన్స్ లోని ముఖ్యమైన సమాచారాన్ని తాము బహిరంగంగా పంచుకోలేమని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News