Wednesday, January 22, 2025

క్లాసెస్ వీర విధ్వంసం

- Advertisement -
- Advertisement -

సెంచూరియన్: ఆస్ట్రేలియాతో శుక్రవారం నాలుగో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయాడు. ఆస్ట్రేలియా బౌలర్లను ఊచకోత కోసిన క్లాసెన్ పరుగుల సునామీ సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన క్లాసెన్ 83 బంతుల్లోనే అజేయంగా 174 పరుగులు చేశాడు. అతని స్ట్రయిక్‌రేట్ 209.64 ఉండడం విశేషం. అసాధారణ బ్యాటింగ్‌తో అలరించిన క్లాసెన్ 13 భారీ సిక్సర్లు, మరో 13 బౌండరీలు కొట్టడం విశేషం. అతనికి డేవిడ్ మిల్లర్ సునామీ ఇన్నింగ్స్ కూడా జతకలిసింది.

చెలరేగి ఆడిన మిల్లర్ 45 బంతుల్లోనే ఐదు సిక్సర్లు, ఆరు ఫోర్లతో అజేయంగా 82 పరుగులు చేశాడు. ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 222 పరుగులు జోడించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 416 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. మిగతా వారిలో ఓపెనర్లు డికాక్ (45), హెండ్రిక్స్ (28), వండర్ డుసేన్ (62) పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తాజా సమాచారం లభించే సమయానికి 7 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News