Thursday, April 3, 2025

హెన్రిచ్ క్లాసెన్ సంచలన నిర్ణయం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టెస్టు క్రికెట్‌కు దక్షిణాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ వీడ్కోలు పలికాడు. వన్డే, టి20 ఫార్మాట్లలలో ఆడుతానని, టెస్టుకు మాత్రమే గుడ్‌బై చెప్పానని వివరించారు. టెస్టు క్రికెట్ నుంచి వైదొలిగినందుకు బాధగా ఉందని క్లాసన్ చెప్పారు. టెస్టు బ్యాట్స్‌మెన్‌గా దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు క్లాసెన్ నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడి 104 పరుగులు చేశారు. 2019లో భారత్‌పై ఆరంగ్రేటం చేయగా 2023లో వెసిండీస్‌పై తన చివరి టెస్టు ఆడాడు. ఆస్ట్రేలియాపై 35 పరుగులు అతడికి టెస్టుల్లో అత్యధిక పరుగులు కావడం గమనార్హం. ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ తరపున ఆడుతున్నాడు. హెన్రీచ్ టి20, వన్డేలలలో దక్షిణాఫ్రికా తరపున దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News