Monday, March 10, 2025

పట్టపగలే దారుణం.. తుపాకీలు చూపించి రూ.25 కోట్ల నగల చోరీ

- Advertisement -
- Advertisement -

బిహార్ రాష్ట్రంలో దొంగల భయం సాధారణంగానే ఎక్కువగా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో ఎప్పుడు దొంగతనాలు జరుతాయా అంటూ జనం బిక్కుబిక్కుమంటూ ఉంటారు. తాజాగా భోజ్‌పూర్ జిల్లాలోని ఆరా నగరంలో పట్టపగలే సినీ ఫక్కీలో దొంగతనం చోటు చేసుకుంది. తనిష్క్ బంగారు ఆభరాణల షోరూంలోకి తుపాకీలతో ప్రవేశించిన దొంగలు ఏకంగా రూ.25 కోట్ల విలువైన నగలు, నగదు దొంగలించుకుపోయారు.

సోమవారం ఉదయం 10 గంటలకు తనిష్క్ షోరూంను తెరిచారు. తెరిచిన కాసేపటికే ఐదారుగురు మంది దుండగులు ముఖాలకు హెల్మెట్లు, మంకీ క్యాప్‌ల ధరించి తుపాకీలతో లోనికి ప్రవేశించారు. సెక్యూరిటీ వద్ద ఉన్న తుపాకీని కూడా స్వాధీనం చేసుకొని షోరూంలో ఉన్న నగలను అపహరించారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొనే లోపే దొంగలు అక్కడి నుంచి పరార్ అయ్యారు. దీంతో పారిపోతున్న దొంగలపై పోలీసులు కాల్పులు జరపగా ఇద్దరికి గాయలయ్యాయి. ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సిసిటివి కెమెరాలో రికార్డు అయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News