Sunday, January 19, 2025

కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్ చక్కర్లు

- Advertisement -
- Advertisement -

చార్‌ధామ్ యాత్రికులకు హెలికాప్టర్ ప్రయాణం చుక్కలు చూపించింది. ఉత్తరాఖండ్‌లో ఆరుగురు యాత్రికులతో కేదారినాథ్ వెళ్లుతున్న హెలికాప్టర్ ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. పైలట్ అత్యంత చాకచక్యంతో వ్యవహరించి అతి కష్టం మీద దీనిని హెలిపాడ్‌కు సమీపంలో కిందికి దింపడంతో ప్రాణగండం తప్పింది. నేలపై గడ్డిలో హెలికాప్టర్ దిగింది. శుక్రవారం ఉదయం ఏడు గంటలకు కేదార్‌నాథ్ సమీపంలో అత్యధిక సంఖ్యలో ప్రయాణికులు ఉన్న ప్రాంతంలోనే ఈ ఘటన జరిగింది. ప్రదక్షణల మాదిరిగా కలియతిరుగుతున్న హెలికాప్టర్‌ను చూస్తూ ఉన్న యాత్రికులపైకి ఓ దశలో కుప్పకూలే పరిస్థితి,

ఈ క్రమంలో అక్కడున్న వారు పెద్ద పెట్టున కేకలు పెడుతూ పరుగులు తీయడం వంటి దృశ్యాలతో కూడిన వీడియోలు వెలువడ్డాయి. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపాలతోనే ఇది గుండ్రంగా తిరిగిందని, దీనిని అతికష్టం మీద పైలట్ అదుపులోకి తీసుకురాగలిగారని, ప్రయాణికులు, పైలట్ సురక్షితంగా ఉన్నారని అధికారులుతెలిపారు. మోటార్ మొరాయించడం ప్రయాణికులకు చావుభయాన్ని తెచ్చిపెట్టింది. ఈ నెల 10వ తేదీన చార్‌ధామ్ యాత్ర ఆరంభమైంది, యాత్రికులు హెలికాప్టర్ల ద్వారా కేదార్‌నాథ్ చేరుకోవల్సి ఉంటుంది. కొందరు అత్యంత క్లిష్టమైన కొండలదారి మీదుగా వెళ్లాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News