లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. సీఎం యోగి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను వారణాసిలో ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేశారు. అయితే, సీఎం యోగి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పక్షి ఢీకొనడంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేశారు. వివరాలలోకి వెళితే…రెండు రోజుల పర్యటన నిమిత్తం సీఎం యోగి వారణాసికి వెళ్లారు. కాగా, ఆదివారం వారణాసిలోని రిజర్వ్ పోలీస్ లైన్స్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్‌లో లక్నోకు బయలుదేరారు. ఈ క్రమంలో హెలికాప్టర్‌ను పక్షి ఢీకొనడంతో పైలెట్ అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. అనంతరం సీఎం యోగి, సిబ్బందిని వేరే హెలికాప్టర్‌లో లక్నోకు తరలించినట్టు జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్‌రాజ్ శర్మ చెప్పారు. కాగా, శనివారం నాడు వారణాసిలో పర్యటించి అభివృద్ది పనులు, శాంతిభద్రతలను సీఎం యోగి సమీక్షించారు. ఆదివారం నాడు లక్నోకు బయలుదేరే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
- Advertisement -
- Advertisement -
- Advertisement -