న్యూయార్క్: అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన రాకెట్ ల్యాబ్ ప్రయోగ సంస్థ ఒక అద్భుతమైన ప్రయోగాన్ని విజయవంతం చేసింది. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన ప్రయోగాల్లో గొప్ప మైలురాయిని సాధించింది. అంతరిక్షం లోకి అనేక ఉపగ్రహాలతో రాకెట్ ను పంపాలంటే ఎన్నో కోట్ల రూపాయల ఖర్చు అవసరం అవుతుంది. అంత ఖర్చు తగ్గించుకునేలా వాటిని తిరిగి భూమి మీదకు తీసుకు వచ్చేందుకు చేసిన ఈ ప్రయోగం అద్భుతమైన విజయాన్ని అందించింది. అపర కుబేరుడు స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలెన్ మస్క్ ఈ రాకెట్ ల్యాబ్‌ను నిర్వహిస్తున్నారు. న్యూజిల్యాండ్‌లో బుధవారం ఉదయం 10.50 గంటలకు అంతరిక్షం లోని కక్ష లోకి 34 ఉపగ్రహాలను పంపడానికి బయలుదేరిన బూస్టర్ రాకెట్ ఆకాశంలో ఒకానొక దశలో కొంత ఎత్తుకు చేరుకున్న తరువాత భూమి మీద పడిపోవడం మొదలైంది.
అదే సమయంలో న్యూజిలాండ్ దక్షిణ ఫసిఫిక్ సమీపంలో ఉన్న ఒక హెలికాప్టర్ రాకెట్‌ను పట్టుకోడానికి 22 మైళ్ల దూరంలో ఒక పారాచూట్‌ను వదిలింది. హెలికాప్టర్ పారాచూట్ , కేబుల్ వైర్ల సాయంతో ఆ రాకెట్‌ను పట్టుకుంది. ఆ తరువాత ఆ రాకెట్ పసిఫిక్ మహా సముద్రం లోకి దూసుకెళ్లింది. ఈ మేరకు ఈ రాకెట్ ప్రయోగం పాక్షికంగా విజయవంతమైంది. కానీ ఆ రాకెట్‌ను సముద్రంలో పడకుండా భూమి మీదకు తీసుకురాగలిగితే పూర్తి స్థాయిలో విజయం సాధించినట్టని రాకెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ బెక్ చెప్పారు. ఆ రాకెట్ సురక్షితంగా సముద్రం లోకి దూసుకెళ్లిందని, దాన్ని ఓడ సాయంతో తిరిగి తీసుకువస్తామని తెలిపారు. అయితే ఆ బూస్టర్ రాకెట్ తిరిగి వినియోగం కానుందా లేదా అనేది స్పష్టం చేయలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో బాగా వైరల్ అవుతోంది.
🚁 This was the moment a helicopter caught a falling rocket booster before dropping it into the ocean https://t.co/sPxDJjhEtt pic.twitter.com/I00r9G014L
— Reuters (@Reuters) May 3, 2022