Saturday, November 16, 2024

ఆర్మీ హెలికాప్టర్ కూలి సిరిసిల్ల జవాన్ మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ సిరిసిల్ల/శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో గురువారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సిరిసిల్ల జిల్లా వాసి పబ్బల్ల అనిల్ మృతి చెందారు. సిరిసిల్ల జిల్లా బోయినిపెల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన పబ్బల్ల అనిల్ హెలికాప్టర్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. పది సంవత్సరాలుగా ఆర్మీలో పని చేస్తున్న అనిల్ ఇటీవలే 45 రోజులు సెలవుపై స్వగ్రామం వచ్చి సుమారు పది రోజుల క్రితం తిరిగి ఆర్మీ విధుల్లో చేరినట్లు సమాచారం. గురువారం హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో అనిల్ మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. మృతునికి భార్య సౌజన్య, కుమారులు ఆయన్ (6), ఆరో (3) ఉన్నారు. అనిల్ మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. జమ్మూ కశ్మీర్‌లోని కిస్టువార్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.

భారత సైనానికి చెందిన ఎఎల్‌హెచ్ ధ్రువ్ అనే హెలికాప్టర్ కుప్పకూలింది.సమాచారం తెలుసుకున్న ఆర్మీ సహస్రబల్, పోలీస్‌లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మార్వా అటవీ ప్రాంతంలోని ఓ నదిలో హెలికాప్టర్ శకలాలను గుర్తించారు. పైలట్, కోపైలట్ గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. మార్చి 8న అరుణాచల్ ప్రదేశ్ లోని మండాల హిల్స్ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీకి చెందిన చీతాహెలికాప్టర్ కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి చెందారు. ధ్రువ్ హెలికాప్టర్లు ప్రమాదాలకు గురికావడం గత రెండు నెలల్లో ఇది రెండసారి. మార్చి ఘటన తరువాత ధ్రువ్ హెలికాప్టర్ల వినియోగాన్ని నిలిపివేసినప్పటికీ, గత సోమవారం నుంచే వీటిని మళ్లీ వినియోగించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరగడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News