- Advertisement -
కాబుల్: ఆఫ్ఘన్‌లోని మైదాన్ వరదాక్ ప్రావిన్సుకు చెంందిన బెహసూద్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తొమ్మిదిమంది సైనికులు మరణించారని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వశాఖ గురువారం ప్రకటించింది. ఐదుగురు భద్రతా సిబ్బందితోపాటు నలుగురు సిబ్బందితో వెళుతున్న ఎంఐ-17 హెలికాప్టర్ బెహసూద్ జిల్లాలో కూలిపోయినట్లు రక్షణ శాఖ తెలిపింది. ఈ ప్రమాదంలో తొమ్మిదిమంది వరకు మరణించారని తెలిపింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది.
ఇలా ఉండగా, దేశ రాజధాని కాబుల్‌లో గురువారం ఒక మినీ బస్సుపై జరిగిన బాంబు దాడిలో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు మరణించినట్లు కాబుల్ పోలీసులు ప్రకటించారు. మృతులలో ఒక మహిళ కూడా ఉందని వారు చెప్పారు. ఈ బాంబు పేలుడులో మరో తొమ్మిదిమంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -