- Advertisement -
హోస్టన్ నగరం లోని రెండో వార్డులో ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో హెలికాప్టర్ కూలి నలుగురు మృతి చెందారు. నగరానికి తూర్పు ప్రాంతంలో ఎల్లింగ్టన్ ఫీల్డు నుంచి ఆర్ 44 హెలికాప్టర్ టేకాఫ్ అయిన తరువాత రేడియో టవర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.
మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. ఇది హెచ్‌పిడి హెలికాప్టర్ కాదని, ప్రైవేట్ టూరింగ్ హెలికాప్టర్ అని హోస్టన్ సిటీ కౌన్సిల్ మెంబర్ మేరియా కేస్టిలో వెల్లడించారు. ఎమర్జెన్సీ సిబ్బంది పెద్ద సంఖ్యలో సంఘటన ప్రదేశానికి తరలి వెళ్లారు. ఆ ప్రదేశంలో తమ నివాసాలపై ఏదైనా కనిపిస్తే వెంటనే తెలియజేయాలని పోలీస్‌లు, ఫైర్‌సర్వీస్ అధికారులు అక్కడి ప్రజలను కోరారు.
- Advertisement -