- Advertisement -
బీరట్ : ఈశాన్య సిరియాలో హెలికాప్టర్ ప్రమాదం జరిగి అమెరికాకు చెందిన 22 మంది సిబ్బంది గాయపడ్డారని అమెరికా వెల్లడించింది. ప్రమాదానికి కారణంపై దర్యాప్తు జరుగుతోందని అమెరికా మిలిటరీ పేర్కొంది. గాయపడిన సర్వీస్ సభ్యులు చికిత్స పొందుతున్నారని, వీరిలో 10 మంది అత్యంత వైద్య సౌకర్యాల ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.
ఈ ప్రమాదం ఆదివారం జరిగింది. శత్రువర్గాల దాడి కాకపోయినా దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే సిరియాలో అమెరికా దళాలు దాదాపు 900 వరకు నిత్యం మోహరించి ఉంటాయి. కుర్దిష్ నాయకత్వం లోని సిరియా డెమొక్రటిక్ దళాలకు మద్దతుగా అమెరికా దళాలు పనిచేస్తుంటాయి.
- Advertisement -