Thursday, January 2, 2025

పాకిస్థాన్‌లో హెలికాప్టర్ కూలి ఆరుగురి మృతి

- Advertisement -
- Advertisement -

పాకిస్థాన్ వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో శనివారం హెలికాప్టర్ కూలి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్‌లో మొత్తం 14 మంది ఉన్నారు. గాయపడిన వీరిలో ముగ్గురు రష్యాకు చెందిన ముగ్గురు పైలట్లు ఉన్నారు. మారి పెట్రోలియం ఆయిల్‌ఫీల్డ్ కంపెనీకి చెందిన ఈ హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఇంజిన్ విఫలం అయిందని అధికారులు ప్రకటించారు. ప్రావిన్స్ లోని ఉత్తర వజ్రిస్థాన్ జిల్లాలో కంబైన్డ్ మిలిటరీ ఆస్పత్రి థాల్‌ను పైలట్లు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు. ఏదైనా ఉగ్రవాద చర్య అన్న అనుమానాన్ని అధికారులు కొట్టి పారేశారు. అయితే ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రావిన్స్ గవర్నర్ ఫైసల్ కరీమ్ కుండి తీవ్ర సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంపై నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News