Saturday, December 28, 2024

ఎన్నికల ప్రచారంలో కూలిన హెలికాప్టర్…. శివసేన నేతకు తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

రాయ్‌గఢ్: శివసేన నేత సుష్మా అంధారేకు పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ ప్రాతం మహద్ పట్టణం శివారులో జరిగింది. లోక్ సభ ఎన్నికలలో భాగంగా ఆమె ప్రచారం వెళ్లడానికి హెల్ కాప్టర్ వచ్చింది. హెలికాప్టర్ ల్యాండింగ్ చేసే సమయంలో కుప్పకూలింది. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన పైలట్ హెలికాప్టర్ నుంచి బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. రెస్య్కూ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే సుష్మా తన కారులో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. శివసేనలో ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన గ్రూపులో ఆమె ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News