Thursday, April 3, 2025

హైదరాబాద్ వస్తుండగా కూలిన హెలికాప్టర్..

- Advertisement -
- Advertisement -

పుణె: ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ హెలికాప్టర్ పౌద్ సమీపంలో కూలిపోయింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో నలుగురు ప్రయాణికులు ఉన్నారని పుణె రూరల్ ఎస్పీ పంకజ్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. వీరంతా ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో కెప్టెన్ తీవ్రంగా గాయపడగా ఆయనను ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన హెలికాప్టర్ గ్లోబల్ వెక్ట్రా కంపెనీకి చెందింది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియక పోయినా ప్రతికూల వాతావరణం వల్ల ఇది జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. పుణెలో శనివారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News