- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్ : వరద ప్రభావిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐఎఎఫ్ సహాయక చర్యలు పాల్గొంది. మంగళవారం జిల్లాలోని చర్ల, దుమ్ముగూడెం మండలాల పరిధిలోని వరద ప్రభావిత గ్రామాల బాధిత ప్రజలకు సహాయక సామగ్రిని చేతక్ హెలికాప్టర్ ద్వారా నిత్యావసర వస్తువులను అందజేశారు. భద్రాచలం పట్టణం నుంచి రోజంతా హెలికాప్టర్ ద్వారా ప్రభావిత వరద ప్రాంతాల్లో నిత్యావసర సరకులతో పాటు 450 కిలోల సహాయ పునరావస వస్తువులను అందజేస్తున్నారు. హెలికాప్టర్ ద్వారా ఇప్పటి వరకు 790 కిలోలు వస్తువులను బాధితులకు అందజేయడం జరిగిందన్నారు. హెలికాప్టర్ ద్వారా వరద పరిస్థితిని అంచనా వేయడానికి వైమానిక నిఘాను ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టడం జరిగిందని జిల్లా సీనియర్ అధికారులు తెలిపారు. జిల్లాలో చేపట్టే సహాయక చర్యల్లో భాగంగా మరి కొన్ని రోజుల్లో హెలికాప్టర్‌ను వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.
- Advertisement -