Wednesday, January 22, 2025

మంత్రి వెంకట్రెడ్డిపై హెలికాప్టర్‌తో పూలవర్షం..

- Advertisement -
- Advertisement -

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు పూలవర్షం కురిపించారు. కాంగ్రెస్ సర్కార్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి సొంత జిల్లాకు వచ్చిన మంత్రి వెంకట్ రెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

మామూలుగా కాదు.. బాగా ఖరీదైన స్వాగతమే పలికారు. తన కాన్వాయ్ లో వచ్చిన మంత్రికి హెలికాఫ్టర్ తో పైనుంచి పూలవర్షం కురిపిస్తూ తమ ప్రేమను చాటుకున్నారు. ప్రస్తుతం మంత్రికి హెలికాఫ్టర్ తో పూలవర్షంతో స్వాగతం పలికిన వీడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు, అభిమానులు స్పందిస్తూ.. కామెంట్స్ పెడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News