Monday, December 23, 2024

ఆరుగురు ప్రయాణికులతో హెలికాప్టర్ అదృశ్యం

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: ఆరుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న ఒక హెలికాప్టర్ మంగళవారం ఉదయం నుంచి నేపాల్‌లో అదృశ్యమైంది. నేపాల్‌లోని నొలుఖుంబు నుంచి ఖట్మాండు వెళుతున్న ఈ హెలికాప్టర్‌కు ఉదయం 10 గంటల ప్రాంతంలో కంట్రోల్ టవర్‌తో సంబంధాలు తెగిపోయాయని నేపాల్ సమాచార అధికారి జ్ఞానేంద్ర భుల్ తెలిపారు.

9ఎన్‌ఎంవి హెలికాప్టర్ స్థానిక కాలమానం ఉదయం 10.12 గంటలకు రాడార్ పరిధి నుంచి మాయమైనట్లు ఆయన చెప్పారు. ఈ హెలికాప్టర్ ఐదుగురు మెక్సికన్ జాతీయులు ఉన్నట్లు రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News