మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం హెలీప్యాడ్ సేవలు
అందుబాటులోకి తీసుకొచ్చిన పర్యాటక శాఖ
జాతరలో ఏరియల్ వ్యూ రైడ్ కోసం ఒక్కోక్కరికి రూ.3,700లు
హన్మకొండలోని ఆర్ట్ కాలేజీ గ్రౌండ్స్ నుంచి
మేడారానికి రానుపోనూ ఒక్కోక్కరికి రూ.19,999లు
మనతెలంగాణ/హైదరాబాద్: మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం పర్యాటక శాఖ హెలీప్యాడ్‌ల సేవలను అందుబాటులోకి తెచ్చింది. హన్మకొండ ఆర్ట్ కాలేజీ నుంచి మేడారం జాతరకు ఏరియల్ వ్యూ రైడ్ చేసేందుకు భక్తులకు అవకాశం కల్పించింది. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ ఈ సర్వీసును ఈనెల 13వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకొస్తుంది. హన్మకొండలోని ఆర్ట్ కాలేజీ గ్రౌండ్స్ నుంచి మేడారానికి రానుపోనూ ఒక్కోక్కరికి రూ.19,999లుగా ధర నిర్ణయించారు. మేడారం జాతరలో ఏరియల్ వ్యూ రైడ్ కోసం ఒక్కోక్కరికి రూ.3700లు వసూలు చేయనున్నట్టు తెలిపింది. హెలీక్యాప్టర్ రైడ్ బుకింగ్ కోసం 9400399999, 9880505905, info@helitaxii.comలను సంప్రదించాలని ప్రభుత్వం తెలిపింది.
Helipad services for Medaram Jatara from Feb 13