- Advertisement -
విశాఖపట్నం: ద్విచక్రవాహనాలపై వెళ్లే వెనుక కూర్చునేవారు(పిల్లియన్ రైడర్స్) సైతం ఇకపై వైజాగ్‌లో హెల్మెట్ ధరించాల్సిందే. అక్టోబర్ 20 నుంచి ఈ నియమం అమలులోకి వస్తుంది. ద్విచక్ర వాహనాలపై వెళ్లే ఇద్దరూ హెల్మెట్‌లు పెట్టుకునే చూడాలని విశాఖపట్నం కలెక్టర్ ఏ. మల్లికార్జున పోలీస్, రవాణా శాఖలను ఆదేశించారు. కలెక్టరు ఉత్తర్వులు జారీ చేసినట్లు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ జిసి రాజా రత్నం తెలిపారు. మోటారు వాహన చట్టం 1988లోని 129 వ సెక్షన్ ప్రకారం ఇకపై వెనుక సీటులో కూర్చునే వారు(పిల్లియన్ రైడర్స్) కూడా హెల్మెట్లు ధరించాల్సి ఉంటుంది. అక్టోబర్ 20 నుంచి ప్రత్యేక చర్యలు (స్పెషల్ డ్రైవ్) చేపట్టి నియమాన్ని ఉల్లంఘించే వారికి రూ. 1000 జరిమాన విధించనున్నారు.
- Advertisement -