Friday, November 22, 2024

విధులు నిర్వహించే పోలీసులే రియల్ హీరోస్,

- Advertisement -
- Advertisement -

శ్రీనివాస్ రెడ్డి
కార్డెన్ సర్చ్
నమోదైతే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలకు ముప్పు
బానిసలై కుటుంబాలను పాడు చేసుకోవద్దు….

Helmet protect Life in Kamareddy

మన తెలంగాణ/ దొమకొండ: కామారెడ్డి జిల్లా దొమకొండ మండలంలోని సంగమేశ్వర్ గ్రామమంలో గురువారం ఉదయం ఎస్‌పి శ్రీనివాస్ రెడ్డి అద్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. గ్రామంలోని వాహనాలన్ని ఒక్కచోటకి చేర్చి, గ్రామ ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి వాహన దారుడు రోడ్డు భద్రత, నియామాలను పాటిస్తూ హెల్మెట్ తప్పకుండా ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని సూచించారు. ఇలా చేయడం వల్లనే జిల్లాలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. యువత మంచిగా చదివి ఉన్నతంగా ఎదగాలని సూచించారు. యువతకు పోలీస్ స్టేషన్ పరిదిలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబందించి స్టైఫండ్‌తో కూడిన ఉచిత కోచింగ్ ఇస్తున్నామని, యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పేకాట ఆడుతు, దొంగతనాలూ చేస్తు, దోపిడిలకు పాల్పడుతు, స్రీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి, ర్యాగింగ్ చేస్తు బావి జీవితం, భవిష్యత్ పాడు చేసుకోవద్దని హితవు పలికారు.

పేకాట స్థావరాలపై నిఘా పెంచామని, పేకాట అడేవారిని కనుగొన్నప్పుడు, గంజాయి, మాదక ద్రవ్యాలు వాడకం దారులను కనుగొన్నప్నుడు పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈలాంటి కేసులు నమోదైనవారికి భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ ఎద్యోగాలు రావని హెచ్చరించారు. యువత సమాజ ఉన్నతికి ఉపయోగ పడాలి కాని విద్వంసానికి, కుటుంబ నాశనానికి కారణం కాకుండా చూసుకోవాలన్నారు. వ్యసనాలకు బానిసలై కుటుంబాలను పాడు చేసుకోవద్దన్నారు. సమాజంలో పౌరులకు 24 గంటలు అందుబాటులో వుండి విధులు నిర్వహించే పోలీసులే రియల్ హీరోస్ అని రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పకడ్భందీగా వుందని, నేరస్తులు ఒక్కరు కూడా తప్పించుకోలేరని హెచ్చరించారు.

గ్రామంలో ప్రతి ఇంటికి సిసి కెమారాలను బిగించు కోవాలన్నారు. కామారెడ్డి జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటివరకు 48 కుటుంబ హత్యలు జరిగాయని, వాటి అన్నిటికి యువత చెడు మార్గంలో నడవడమే, కుటుంబ తగాదాలే కారణమన్నారు. ఈ కార్యక్రమమంలో కామారెడ్డి డిఎస్‌పి సోమనాథమ్, బిక్‌నూర్ సిఐ తిరుపతయ్య, శ్రీనివాసులు, ఎస్‌ఐలు సుధాకర్, అనంద్, గంగారెడ్డి, ఎఎస్‌ఐ ఉమేష్, శ్రీకాంత్, ఎల్లయ్య, పోలీసు సింబంది ప్రజా ప్రతినిదులు వైఎస్ఎంపిపి పుట్ట బాపురెడ్డి, నాయిని రాంరెడ్డి, నాయకులు మురళీ, శ్రీనివాస్‌రావు, నాయిని పెద్ద బాల్ రెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News