Thursday, November 21, 2024

ట్రాఫిక్ పోలీసుల ‘హెల్మెట్’ రూల్

- Advertisement -
- Advertisement -

Helmet Rules of Traffic Police in Hyderabad

హైదరాబాద్ : ట్రాఫిక్ నిబంధనలలో కొత్త పద్దతికి శ్రీకారం చుట్టారు. ఇకపై హెల్మెట్ ధరించడకుండా బైక్ నడిపే వారి వాహనం స్వాధీనం చేసుకుని హెల్మెట్ కొనుగోలు చేసిన తరువాత వాహనాన్ని వదిలిపెట్టనున్నారు. ఈక్రమంలో సైబరాబాద్ పరిధిలో జనవరి 1వ తేదీ నుంచి ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్‌ను అమలు చేశారు. హెల్మెట్ లేకుండా బండి నడిపినవారిని ఫోటో తీయడం, జరిమానాలు విధించడం చేయకుండా వాహనాన్ని అక్కడే ఆపి హెల్మెట్ తెచ్చుకునే వరకు బైక్ ఇవ్వకూడదని నిర్ణయించారు. రోడ్డు ప్రమాదాలను నివారించే క్రమంలోనే సైబరాబాద్ పోలీసులు ఈ వినూత్న నిర్ణయానికి వచ్చారు. సైబరాబాద్ పరిధిలో ఏడు చోట్ల చెక్ పోస్టులు పెట్టి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అలాగే వాహనం పిలెన్ రైడర్(వెనకాల కూర్చున్న వ్యక్తి) కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వెల్లడించారు. దీనిపై పోలిసులు 24/7 పర్యవేక్షణ చేస్తున్నారు. గతేడాది దాదాపుగా 27 శాతం రోడ్డు ప్రమాదాల్లో మరణాలు తగ్గాయని.. వాహనదారుల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా కొత్త రూల్‌ను అమలులోకి తీసుకొచ్చామని సైబరాబాద్ ట్రాఫిక్ విభాగంలోని ఉన్నతాధికారులు వెల్లడించారు.

Helmet Rules of Traffic Police in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News