Monday, December 23, 2024

మాస్టర్ మోక్షిత్ తండ్రికి వైద్య సహాయం కోసం..

- Advertisement -
- Advertisement -
సిఎంఆర్‌ఎఫ్ నుండి రూ.2.50 లక్షల చెక్ అందజేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ : మహబూబ్ నగర్ కు చెందిన మాస్టర్ కె. మోక్షిత్ తండ్రి నరేందర్ జీ హైదరాబాదులో అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు, ఈ సమాచారం తెలుసుకొన్న రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 2 లక్షల 50 వేల రూపాయల ఎల్‌ఓసిని గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఏడిఏ) చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

అంతకు ముందు మహబూబ్ నగర్ లోని ఎంవిఎస్ డిగ్రీ కళాశాలలో క్యాంటీన్ ను ప్రారంభించిన సందర్బంగా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఎంవిఎస్ కళాశాల విద్యార్థులతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా విద్యార్ధుల తో మాట మంతి నిర్వహించి విద్యార్థిగా ఇదే కళాశాలలో చదువుకున్నానని గత స్మృతులను విద్యార్థులతో నెమరవేసుకున్నారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత విద్యాభ్యాసం చేసి జీవితం లో స్థిరపడాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. కళాశాల క్యాంటీన్‌లో విద్యార్థులకు చక్కని భోజనాన్ని అందించాలని శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News