రాష్ట్ర రోడ్లు-, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్న నిజామాబాద్ వాసులు, విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర రోడ్లు-, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఉక్రెయిన్‌లో ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా గగనతల మార్గం అందుబాటులో లేనందున ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ సిబ్బంది బస్సు మార్గం ద్వారా సరిహద్దు దేశాలైన హంగరి, పోలాండ్, స్లోవాక్ రిపబ్లిక్, రోమానియా దేశాలకు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారిని తరలిస్తుందని ఆయన తెలిపారు. ఉక్రెయిన్ భారత ఎంబసీతో పాటు సరిహద్దు దేశాల భారత ఎంబసీలు సైతం ఆయా దేశ సరిహద్దుల వద్ద అందుబాటులో ఉంటాయన్నారు. అక్కడి నుంచి భారత విదేశీ మంత్రిత్వ శాఖ బాధితులను గగనతల మార్గం ద్వారా స్వస్థలాలకు చేరుస్తుందని మంత్రి పేర్కొన్నారు. జిల్లా వాసులు స్వస్థలాలకు చేరుకునే వరకు తమ బృందం కూడా అందుబాటులో ఉంటుందని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని ఆయన తెలిపారు. జిల్లా వాసులకు పూర్తి సహాయ, సహకారాలు అందించేందుకు తమ బృందం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉందని ఆయన పేర్కొన్నారు.
హెల్ప్‌లైన్ కాంటాక్ట్ నెంబర్స్
మినిస్టర్ ఆర్ అండ్ బి పేషీ నిజామాబాద్ విజయేందర్ రెడ్డి ఓఎస్డీ -9491036934
మినిస్టర్ ఆర్ అండ్ బి పేషీ హైదరాబాద్ ప్రవీణ్ అడిషనల్ పిఎస్ -9849970722
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ తరఫున చిట్టిబాబు -9440854433
తెలంగాణ భవన్ ఢిల్లీ నుంచి విక్రం సింగ్ మాన్, ఐపిఎస్ +91-7042566955
చక్రవర్తి, పిఆర్‌ఓ +91-9949351270
నితిన్ ఓఎస్డీ +91-9654663661