Wednesday, January 15, 2025

రాష్ట్ర విద్యార్థులకు అన్నగా తోడుంటా

- Advertisement -
- Advertisement -

ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే సేవకుడను
అవుతా వారి భవితను నిర్మించే
శ్రామికుడిని అవుతా ఎక్స్
వేదికగా సిఎం రేవంత్‌రెడ్డి ట్వీట్

మనతెలంగాణ/హైదరాబాద్ :తెలంగాణ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, సంక్షేమానికి అన్నగా తోడుంటానని సిఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల విద్యార్థులకు కొత్త మెనూ ప్రకటించిన సందర్భాన్ని ఆయన ఎక్స్ వేదికగా గుర్తు చేశారు. అన్నగా తోడుంటా ఆత్మ విశ్వాసాన్నిచ్చే సేవకుడనవుతానని ఆయన పేర్కొన్నారు. రేపటి తెలంగాణను నిర్మించే ఈ బిడ్డల భవితను నిర్మించే శ్రామికుడవుతానని సిఎం రేవంత్ ట్వీట్ చేశారు. గురుకులాలు, హాస్టళ్లలో ఎదురవుతున్న నాసిరకం భో జనం, ఫుడ్ పాయిజన్ ఘటనలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం ఇటీవల డైట్ చార్జీలను 40శాతం పెంచడంతో పాటు తాజాగా ఏటా రూ.470 కోట్ల ఖర్చుతో కొత్త మెనూ ప్రకటించింది. రోజు ఉదయం రెండు అల్పాహారాలు, మధ్యాహ్నం సన్నబియ్యంతో వండిన అన్నంతో కలిపి ఏడురకాల పదార్ధాలు, గుడ్డు, నెలకు ఆరుసార్లు మాం సహారంతో కూడిన భోజనం అందించేలా ప్రభు త్వం కొత్త మెనూ ప్రకటించింది. దీంతో సంక్షే మ హాస్టళ్లు, గురుకులాలు, కస్తూర్భా విద్యాలయాల్లో చదువుతున్న 8లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News