Thursday, January 23, 2025

సంక్షేమ పథకాలతో పేదలకు చేయూత

- Advertisement -
- Advertisement -

కోయిలకొండ: బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిరుపేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్షంగా ఆహర్నిశలు పని చేయడం జరుగుతుందని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్. రాజేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మీచెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ వంటి పథకాలు దేశ వ్యాప్తంగా పొందడం జరిగిందన్నారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించడంతో పాటు , సాగునీటి కోసం అనేక ప్రాజెక్టులను రూపొందించడం జరిగిందన్నారు.

రాబోయే కొంత కాలంలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సస్యశ్యామలం కావడం ఖాయమన్నారు. రాష్ట్రంలోని చేతివృత్తుల వారిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ముఖ్యంత్రి కొత్త పథకాన్ని రూపొందించడం జరిగిందన్నారు. వృద్దులకు వికలాంగులకు వితంతువులకు ఒంటరి మహిళలకు సైతం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎక్కువ పెన్షన్ను అందించడం జరుగుతుందన్నారు.

కార్యక్రమంలో ఎంపిపి శశికళ భీంరెడ్డి, జడ్పీటిసీ సభ్యుడు విజయభాస్కర్‌రెడ్డి, మండల బిఆర్‌ఎస్ అధ్యక్షుడు బి. కృష్ణయ్య, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు ఖాజా మైనుద్దీన్, తహసీల్దార్ మురళీధర్, నాయకులు డి. నారాయణ, ఆంజనేయులు, కుమ్మరి రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News