Monday, December 23, 2024

మథురలో కంగన పోటీపై హేమమాలిని సంచలన వ్యాఖ్యలు.. (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర్ ప్రదేశ్‌లోని మథుర నియోజకవర్గం నుంచి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మరో సినీ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తారని వస్తున్న ఊహాగానాలపై బిజెపి పార్లమెంట్ సభ్యురాలు, అలనాటి డ్రీమ్ గర్ల్ హేమమాలిని ఘాటుగా స్పందించారు. మంచిది..అది మంచిది. మథురలో కేవలం సినీతారలే కావాలా..రేపు రాఖీ సావంత్ కూడా ఎంపి కావచ్చు అంటూ హేమమాలిని శనివారం విలేకరుల వద్ద వ్యాఖ్యానించారు.

మథురలోని బృందావనంలో గల బంకే బిహారీ ఆలయాన్ని ఇటీవల కంగనా రనౌత్ తన కుటుంబ సభ్యులతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు భక్తులతోపాటు పెద్దసంఖ్యలో స్థానికులు ఎగబడ్డారు. కంగన ఆలయం నుంచి బయటకు వచ్చే సమయంలో ప్రజలను కంట్రోల్ చేసేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఈ పర్యటన సందర్భంగా విలేకరులు అడిగినప్పటికీ రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు.

కాగా..మథుర పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి కంగన పోటీ చేస్తారన్న వదంతులపై స్థానిక విలేకరులు హేమమాలినిని శనివారం ప్రశ్నించగా ఈ విషయంలో తన అభిప్రాయం ఏం చెప్పాలని అన్నారు. అంతా దైవ నిర్ణయం. మథురలో కేవలం సినీతారలు ఉండాలనే మీరు కోరుకుంటున్నారు. వేరే ఎవరికైనా ఇక్కడ నుంచి ఎంపి కావాలని ఉన్నా మీరు(విలేకరులు) అలా కానివ్వరు. మీకు మాత్రం సినిమా స్టార్లే ఎంపీగా ఉండాలి. రేపు రాఖీ సావంత్ కూడా మథుర నుంచి ఎంపి కావచ్చు..అంటూ హేమమాలిని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

2014లో తొలిసారి మథుర నుంచి లోక్‌సభ ఎంపీగా గెలిచిన హేమమాలిని 2019లో కూడా ఇక్కడి నుంచే గెలిచారు.
అయితే.. కంగన కూడా రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా నిర్మించిన తలైవి సినిమా ప్రమోషన్ల సందర్భంగా ఆ చిత్ర కథానాయిక కంగనా రనౌత్ తన రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అభిమానులు కోరుకుంటే తాను కచ్ఛితంగా రాజకీయాల్లోకి వస్తానంటూ ఆమె చెప్పారు. తలైవి చిత్రం 2021 సెప్టెంబర్‌లో విడుదలైంది.

courtesy by ANI Twitter

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News