Wednesday, January 22, 2025

మెట్రోలో డ్రీమ్‌గర్ల్…. ఆటోలో ఇంటికి (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: లగ్జరీ కార్లు, చుట్టూ అంగరక్షకులను వదిలి ఒక సామాన్య పౌరురాలిగా జనంలో మమేకమై ప్రయాణించారు బిజెపి ఎంపి, అలనాటి డ్రీమ్‌గర్ట్ హేమమాలిని. ముంబై మెట్రోలో ప్రయాణించిన ఆమె సహ ప్రయాణికులతో సెల్ఫీలు దిగి వారిని ఆనందపరిచారు. స్టేషన్ నుంచి తన ఇంటి దాకా ఆటోలో ప్రయాణించి తనను ఆత్మతృప్తి పొందారు. తన ప్రయాణ అనుభవాన్ని హేమ మాలిని ట్వీట్ చేశారు. కారులో దహిసర్ చేరడానికి రెండు గంటలు పట్టిందని, పూర్తిగా అలసిపోయానని ఆమె రాసుకొచ్చారు. జుహులోని నివాసానికి వెళ్లడానికి కనీసం మరో గంటన్నర పడుతుందని, ఇక ఓపిక లేక మెట్రో ఎక్కానని ఆమె తెలిపారు.

Also Read: సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం… పోలీసులకు ఫోన్

ఈ ప్రయాణ అనుభవం అద్భుతంగా ఉందని హేమ తెలిపారు. మెట్రో నిర్మాణంలో ఎన్నో ఇబ్బందులు పడ్డప్పటికీ ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉందని ఆమె అన్నారు. డిఎన్ నగర్ చేరడానికి కేవలం మెట్రోలో అరగంట పట్టిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
అయితే..మెట్రో ప్రయాణంతోనే హేమ తృప్తి పడలేదు. డిఎన్ నగర్ స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత కారును కాదని ఆటో ఎక్కారు. తన ఇంటికి ఆటోలో ప్రయాణం చాలా ఆనందంగా ఉందంటూ ఆమె వీడియో కూడా షూట్ చేశారు. ఆటోలో తాను దిగడం చూసి తన సెక్యూరిటీ సిబ్బంది షాకైపోయారని ఆమె ట్వీట్ చేశారు. మెట్రోలో, జనంతో కలసి ప్రయాణించడం మధురమైన అనుభవమని ట్వీట్ చేస్తూ రెండు వీడియోలను షేర్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News