Friday, December 20, 2024

సోరెన్ కేసులో సాక్షాలుగా టీవీ, ఫ్రిడ్జ్

- Advertisement -
- Advertisement -

రాంచీ : ఝార్ఖండ్ మాజీ సిఎం హేమంత్ సోరెన్ మనీ లాండరింగ్ కేసులో టీవీ, రిఫ్రిజిరేటర్‌లు సాక్షాలుగా ఈడీ చూపించనున్నట్టు తెలుస్తోంది. రూ.31 కోట్ల విలువైన 8.86 ఎకరాల భూమిని సోరెన్ అక్రమంగా సంపాదించారని, ఈడీ చేస్తున్న ఆరోపణలను సమర్థించేందుకు కీలకమైన సాక్షాలలో రిఫ్రెజిరేటర్, టీవీ ఇన్‌వాయిస్‌లను స్వీకరించింది. రాంచీకి చెందిన ఇద్దరు డీలర్ల నుంచి ఈడీ ఈ రశీదులను పొందింది.

సోరెన్‌తోపాటు మరో నలుగురిపై దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో వాటిని జత చేసింది. ఈడీ సేకరించిన టీవీ, రిఫ్రెజిరేటర్‌లను సోరెన్ తన కుటుంబ సభ్యుడు సంతోష్ ముండా పేరు మీద తీసుకున్నట్టు తెలుస్తోంది. సోరెన్ కొనుగోలు చేసిన 8.86 ఎకరాల వ్యవహారాలను 16 ఏళ్ల నుంచి సంతోష్ చూస్తున్నట్టు ఈడీ గుర్తించింది. అయితే ఈ భూమికి తనకు సంబంధం లేదని హేమంత్ సోరెన్ ఈడీ అధికారులతో వాదించగా, సంతోష్ ముండా నుంచి ఈడీ అధికారులు స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News