Monday, December 23, 2024

ఝార్ఖండ్‌ సిఎంగా హేమంత్‌ సోరెన్‌ ప్రమాణస్వీకారం

- Advertisement -
- Advertisement -

ఝార్ఖండ్‌ సిఎంగా మళ్లీ హేమంత్‌ సోరెన్‌ ప్రమాణస్వీకారం చేశారు. గురువారం రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, హేమంత్ సోరెన్ చేత ప్రమాణం చేయించారు.

భూకుంభకోణం కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈ ఏడాది జనవరిలో హేమంత్ సోరెన్ ను ఇడి అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టుకు ముందు ఆయన.. సిఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో చంపయీ సోరెన్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదల అయ్యారు. 5 నెలలుగా జైలులో ఉన్న హేమంత్‌ సోరెన్‌.. మళ్లీ ఝార్ఖండ్‌ సీఎంగా ప్రమాణం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News