Sunday, December 22, 2024

జార్ఖండ్ సిఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం

- Advertisement -
- Advertisement -

జార్ఖండ్ 13వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గురువారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. భూ కబ్జా, మనీలాండరింగ్ నిరోధక చట్టాల పరిధిలో అరెస్టు అయ్యి , 5 నెలల జైలుతరువాత సోరెన్ ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇక్కడి రాజ్‌భవన్‌లో ఆయనతో రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి సోరెన్ తండ్రి , జెఎంఎం అధినేత శిబూ సోరెన్ , తల్లి రూపీ సోరెన్ , భార్య కల్పనా సోరెన్, జెఎంఎం సీనియర్ నేతలు , మిత్రపక్షం వారు హాజరయ్యారు. ఇంతవవరకూ సిఎం పదవిలో ఉండి తిరిగి హేమంత్‌కు బాధ్యతలు అప్పగించిన ఛాంపై సోరెన్ కూడా వచ్చారు. సభా ప్రాంగణం వెలుపల జెఎంఎం కార్యకర్తల జిందాబాద్ నినాదాలు మిన్నంటాయి. జనవరి 31వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడానికి ముందే సోరెన్ పదవికి రాజీనామా చేశారు. ఐదు నెలల పాటు సోరెన్ రాజకీయ గ్రహణం దశలో గడపాల్సి వచ్చింది. అయితే కేసు ఇప్పటికీ ఉంది.

పైగా ఆయనకు బెయిల్‌ను సవాలు చేస్తూ ఇడి సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. ఈ పరిణామాల నడుమనే ఇప్పుడు సోరెన్ తిరిగి బాధ్యతలు తీసుకోవడం ముందుగా పార్టీలో , మిత్రపక్షాలలో అసంతృప్తిని చల్లార్చేందుకే అని వెల్లడైంది. ప్రమాణానికి ముందు తండ్రి, జెఎంఎం దిగ్గజనేత శిబూ సోరెన్‌ను హేమంత్ కలుసుకుని ఆయన ఆశీస్సులు పొందారు. రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు బాబా దీవెనలు పొందానని తెలిపారు. గురువారం సోరెన్ ఒక్కరే ప్రమాణం చేశారు. ఆదివారం కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుందని వెల్లడైంది. నిజానికి హేమంత్ కూడా ఆదివారం ప్రమాణస్వీకారం చేస్తారని ముందుగా వార్తలు వెలువడ్డాయి. అయితే రాజకీయ శూన్యత కొనసాగితే అది తీవ్ర స్థాయికి చేరుతుందని భావించే ముందుగా హేమంత్ ఈ బాధ్యతలు తీసుకున్నారని వెల్లడైంది.

పొగరుబోతులకు ఇదే జవాబు
తిరిగి సిఎంగా ప్రమాణానికి ముందు హేమంత్ సామాజిక మాధ్యమంలో బిజెపిపై ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. అధికారం కోసం కాచుకుని ఉండే అహంకారపూరిత వ్యక్తులు తన గొంతునొక్కాలని చూశారని విమర్శించారు. పలురకాల ఎత్తుగడలకు దిగారు. అయితే వారి బెదిరింపులకు లొంగకపోవడంతో దర్యాప్తు సంస్థలను ఉసికొల్పారని , అయితే ఇప్పుడు జార్ఖండ్ ప్రజల మాట తిరిగి గెలుస్తోందని జై జార్ఖండ్ జై హింద్ అని హేమంత్ సోరెన్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News