Monday, December 23, 2024

నేను జార్కండ్ యోధుడి భార్యను.. అండగా నిలబడతా

- Advertisement -
- Advertisement -

పెళ్లి రోజున హేమంత్ సోరెన్ భార్య కల్పన ప్రకటన

రాంచి: తాను ఒక యోధుడి జీవిత భాగస్వామినని, తాను ఎల్లప్పుడూ తన భర్తకు బలంగా ఉంటానని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ తమ 18వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం తెలిపారు. తమ వివాహ వార్షికోత్సవం నాడు తన భర్త తమతో లేనప్పటికీ కుట్రను భగ్నం చేసి విజేతగా తన భర్త తిరిగి వసారన్న నమ్మకంతో తాను భావోద్వేగం చెందడం లేదని ఆమె పేర్కొన్నారు.

జార్ఖండ్ అస్తిత్వాన్ని, మనుగడను పరిరక్షించడంలో హేమంత్ సోరెన్ ఎన్నడూ తలవంచరని, కుట్రపై పోరాడాలనే ఆయన కృతనిశ్చయంతో ఉన్నారని కల్పన తెలిపారు. ఈ రోజు తమ 18వ వివాహ వార్షికత్సవం నాడు ఆయన తన కుటుంబంతో లేదా పిల్లలతో లేరని, ఈ కుట్రను ఓడించి విజేతగా ఆయన తిరిగి వస్తారని తాము విశ్వసిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ధైర్యవంతుడైన ఒక జార్ఖండ్ యోధుడికి తాను జీవిత భాగస్వామినని, ఈ రోజు తాను భావోద్వేగానికి లోనుకాబోనని ఆమె పేర్కొన్నారు.

హేమంత్ లాగే కష్ట కాలంలో తాను కూడా నవ్వుతూనే ఉంటానని, తన భర్తకు బలంగా ఉండి పోరాటం సాగిస్తానని కల్పన తెలిపారు. కేంద్రం, బిజెపి కుట్రలను భగ్నం చేసి తన భర్త విఏతగా తిరిగివచ్చే వరకు ఆయన సోషల్ మీడియా అకౌంట్లను తాను హ్యాండిల్ చేస్తానని ఆమె చెప్పారు. హేమంత్ సోరెన్ రాజీనామా దరిమిలా ముఖ్యమంత్రి పదవికి వినిపించిన పేర్లలో కల్పనా సోరెన్ ముందువరుసలో ఉన్నారు.

అయితే ఆమె అభ్యర్థిత్వాన్ని శిబూ సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎంటెక్, ఎంబిఎ పట్టభద్రురాలైన కల్పనా సోరెన్ భువనేశ్వర్‌లో ఇంజనీరింగ్, ఎంబిఎ డిగ్రీలను వేర్వేరు కళాశాలల్లో పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఇడి అరెస్టు చేసిన నేపథ్యంలో అసెంబ్లీలో జరిగిన బలసరీక్షలో ముఖ్యమంత్రి చంపయి సోరెన్‌కు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నెగ్గింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News