Wednesday, January 22, 2025

త్వరలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ భార్య

- Advertisement -
- Advertisement -

బిజెపి ఎంపి జోస్యం

రాంచి: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ త్వరలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని, ఆయన భార్య కల్పన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని బిజెపి ఎంపి షిషికాంత్ దూబే సోమవారం జోస్యం చెప్పారు. వ్యక్తిగత కారణాలు చూపుతూ జార్ఖండ్ ముక్తి మోర్చ(జెఎంఎం) శాసనసభ్యుడు సర్ఫరాజ్ అహ్మద్ అసెంబ్లీకి రాజీనమా చేసిన నేపథ్యంలో దూబే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గాండే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్ఫరాజ్ అహ్మద్ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన వెంటనే ఆయన రాజీనామా ఆమోదం పొదింది. అయితే తాను రాజీనామా చేసింది పార్టీ పైన కోపంతో కాదని, పార్టీని, ముఖ్యమంత్రి సోరెన్‌ను బలోపేతం చేసేందుకేనని అహ్మద్ విలేకరులకు తెలిపారు.

కాగా..అవినీతి కేసులో తనపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయవచ్చని హేమంత్ సోరెన్ అనుమానిస్తున్నారని వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి బాధ్యతలను తన భార్యకు అప్పగించాలని జెఎంఎం ఎగ్జిక్యుటివ్ అధ్యక్షుడైన సోరెన్ ఆలోచిస్తున్నారని వర్గాలు వెల్లడించాయి. కాగా..కొత్త సంవత్సరం సోరెన్ కుటుంబానికి బాధను మిగల్చనున్నదని జార్ఖండ్‌లోని గొడ్డా పార్లమంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి ఎంపి దూబే సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వ్యాఖ్యానించారు.

అసెంబ్లీని సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామా చేశారని, ఆయన రాజీనామా వెంటనే ఆమోదం పొందిందని ఆయన తెలిపారు. త్వరలోనే సోరెన్ కూడా రాజీనామా చేస్తారని, ఆయన భార్య కల్పన సోరెన్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై జార్ఖండ్ గవర్నర్ న్యాయ సలహా తీసుకోవాలని బిజెపి ఎంపి కోరారు. 2019 సెప్టెంబర్ 27న జార్ఖండ్ అసెంబ్లీ ఏర్పడింది. డిసెంబర్ 31న సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామా చేశారు. అసెంబ్లీ పదవీకాలం ఏడాదిలోపల ఉంటే ఎన్నికలు జరపడానికి అవకాశం లేదని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News