Wednesday, January 29, 2025

ఆర్టీసి బస్సు ఎక్కిన కోడిపుంజు.. రూ.30ల టికెట్‌ను జారీ చేసిన కండక్టర్

- Advertisement -
- Advertisement -

Hen charged ticket fare for travelling in RTC bus

మనతెలంగాణ/హైదరాబాద్  : ఆర్టీసి బస్సు ఎక్కిన కోడిపుంజుకు కండక్టర్ రూ.30ల టికెట్‌ను జారీ చేశారు. ఈ సంఘటన నిజంగా జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసి బస్సులో ఈ సంఘటన చోటు చేసుకుంది. బస్సుల్లో మూగ జీవాలకు అనుమతి ఉండదు. అయితే ఈ విషయం తెలియని ఆ కోడి యజమాని బస్సులో దానిని తీసుకెళుతున్నాడు. ఈ నేపథ్యంలో చెకింగ్ అధికారులు వస్తే తన ఉద్యోగానికి ఇబ్బంది కలుగుతుందని ఆందోళన చెందిన ఆ బస్సు కండక్టర్ యజమానితో పాటు కోడికి కూడా చార్జీని వసూలు చేశాడు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాశం కావడంతో ఆర్టీసి ఉన్నతాధికారులకు ఈ విషయం చేరింది. ఉన్నతాధికారులు ఈ విషయాన్ని ఆర్టీసి ఎండి సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ సంఘటనపై ఎండి దృష్టి సారించారు. త్వరలో దీనికి సంబంధించిన విషయాలను తెలుసుకుంటానని ఆయన తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News