Thursday, January 23, 2025

ఆశ్చర్యం.. 12 గంటల్లో 31 గుడ్లు పెట్టిన కోడి (వైరల్)

- Advertisement -
- Advertisement -

ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాకు చెందిన కోడి రోజులో 31 గుడ్లు పెట్టి రికార్డు సృష్టించింది. కోడి సాధారణంగా రోజుకు ఒక గుడ్డు పెడుతోంది. కానీ ఈ కోడి మాత్రం ఒక్క రోజులో 31 గుడ్లును పెట్టింది. ఉత్తరాఖండ్ లోని అల్మోరా జిల్లా భికియాసైన్ బసోత్ లో గిరీష్ చంద్ర ఓ కోడిని పెంచుతున్నాడు. ఆ కోడి డిసెంబర్ 25న ఒకే రోజు ముప్పై ఒక గుడ్లు పెట్టింది. అయితే ఆ కోడి సాధారణ ఫుడ్ కాకుండా ప్రత్యేకంగా పల్లీలు, వెల్లుల్లి మాత్రమే తింటుందని గిరిష్ చంద్ర వెల్లడించాడు. ప్రతిరోజు 10-15 నిమిషాలకు ఒక గుడ్డు పెడుతూ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కోడి ఏదో వ్యాధితో బాధపడుతుందని భావించిన గిరీష్ డాక్టర్ దగ్గరకు వెళ్లగా డాక్టర్ కూడా అంతా బాగానే ఉందని చెప్పారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News