Friday, November 22, 2024

హెప ఇమాస్క్‌ను ధరించిన మాజీ ఎంపి

- Advertisement -
- Advertisement -

Hepa E Mask positive pressure

మన తెలంగాణ/హైదరాబాద్ : చేవెళ్ల మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆవిష్కరించిన హెప ఇమాస్కును ధరించి ఎంపి డా. నరేంద్ర జాదవ్ సోమవారం రాజ్యసభ కార్యక్రమాలకు హజరయ్యారు. హెప ఇమాస్క్ పాజిటివ్ ప్రెషర్ ఆధారంగా రూపొందించబడిందని, టర్బైన్ శక్తిని కలిగి ఉంటుందని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇది 99.97 శాతం వడపోత సామర్ధ్యాన్ని కలిగి ఉంటుందన్నారు. దీని ఫిల్టర్ తేలికపాటి బరువును కలిగి ఉండటంతో బ్యాక్టీరియా, వైరస్‌ల ఉంచి రక్షించబడుతుందన్నారు. 95 శాతం మాత్రమే సమర్ధవంతంగా పనిచేసే ఎన్ 95తో పోలిస్తే, హెప ఇమాస్క్ 0.95 మైక్రాన్ కణాలను కూడా 99.97 శాతం వడపోస్తుందన్నారు. దీంతో 166 రెట్లు సురక్షితమైన గాలిని పీల్చుకోవచ్చన్నారు. అయితే విశ్వేశ్వర్‌రెడ్డి ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఇంజనీర్‌గా పలు ఆవిష్కరణలు చేయడం అద్భుత తమని జాదవ్ కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News