Sunday, December 22, 2024

కేరళలో హెపటైటిస్ ఎ వైరస్ విజృంభణ.. 12మంది మృతి

- Advertisement -
- Advertisement -

కేరళలో హెపటైటిస్ ఎ వైరస్ విజృంభిస్తుంది. అత్యంత వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే  12మంది మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది మొదటి నాలుగున్నర నెలల్లో రాష్ట్రంలో 1,977 కేసులు బయటపడ్డాయి.

ఈ క్రమంలో అత్యధిక కేసులు నమోదైన కోజికోడ్, మలప్పురం, త్రిసూర్, ఎర్నాకులం జిల్లాలకు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ జిల్లాల్లో వైరస్ కట్టడికి క్షేత్రస్థాయిలో పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారును ఆదేశించారు. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లోని నీటి వనరులను క్లోరినేషన్ చేస్తామని, రెస్టారెంట్లకు ఉడికించిన నీటిని మాత్రమే సరఫరా చేయాలని చెప్పినట్లు ఆమె తెలిపారు

హెపటైటిస్ ఎ వైరస్(HAV) కాలేయంపై ప్రభావం చూపుతుంది. ఇది కలుషితమైన ఆహారం, నీటి ద్వారా లేదా అంటువ్యాధి కలిగిన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం ద్వారా వ్యాపిస్తుంది.

కాగా, ఈ సంవత్సరం రాష్ట్రంలో మరో 5,536 అనుమానిత కేసులు నమోదైనట్లు తెలు్తోంది. మరో 15 మంది ఈ వైరస్ కారణంగా మరనించినట్లు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News