క్షయ వ్యాధి తరువాత ప్రాణాంతక వ్యాధి హెపటైటిస్ . కాలేయం వాపుతోపాటు , సరిగ్గా పనిచేయలేని పరిస్థితి ఏర్పడితే హెపటైటిస్ వ్యాధి సంక్రమించిందని అంటారు. అడెనో వైరస్ టైప్ 41 వంటి వివిధ వైరస్‌ల వల్ల వచ్చే ఈ వ్యాధి కారణంగా ఏటా 1.4 మిలియన్ జీవితాలు బలైపోతున్నాయి. ఎలాంటి వైద్య చికిత్స లేకుండా అశ్రద్ధ చేస్తే దీర్ఘకాలిక కాలేయ వ్యాధి సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్‌కు దారి తీయవచ్చు. హెపటైటిస్‌లో ఎ, బి, సి, డి, ఇ అనే ఐదు రకాలు ఉన్నాయి. ఇందులో ఎ, బి, సి రకాలు సర్వసాధారణమైనవి.
హెపటైటిస్ రోగుల్లో 80 శాతం మందికి వ్యాధిని నివారించే, పరీక్షించే, వైద్య చికిత్స నిర్వహించే సౌకర్యాలు అందుబాటులో లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రపంచం మొత్తం మీద 290 మిలియన్ మంది హెపటైటిస్ వైరస్‌తో బాధపడుతున్నారని వెల్లడైంది. 2030 నాటికి ప్రపంచంలో హెపటైటిస్ పూర్తిగా నిర్మూలించాలన్నదే ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్షం. హెపటైటిస్ బి వైరస్‌ను కనుగొన్నందుకు నోబెల్ బహుమతి గ్రహీత బెరూచ్ శామ్యూల్ బ్లూంబెర్గ్ గౌరవార్థంగా ఏటా జులై 28ని ప్రపంచ హెపటైటిస్ దినంగా గుర్తిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం భారత్‌లో 2017లో హెపటైటిస్ బి బాధితులు 40 మిలియన్ మంది, హెపటైటిస్ సి బాధితులు 12 మిలియన్ మంది, వర కు ఉన్నట్టు తేలింది. డ్రగ్స్, విషపదార్ధాలు, ఆల్కహాలు, కొన్ని మందుల విపరీత వినియోగం వల్ల హెపటైటిస్ వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
శరీరం బరువు పెరిగినా, స్థూలకా యం వచ్చినా, ఆల్కహాలు రహిత కొవ్వుతో కూడిన కాలేయ వ్యాధి (నాన్ ఆల్కహాలిక్ ఫాటీ లివర్ డిసీజ్ ఎన్‌ఎఎఫ్‌ఎల్‌డి )పొంచి ఉంటుంది. అంటే కాలేయంలో ఉండవలసిన కొవ్వు క న్నా అత్యధికంగా కొవ్వు పేరుకుపోతుంది. 2022 లో ప్రపంచ వ్యాప్తంగా హెపటైటిస్ బీ రోగుల సంఖ్య 25.4 కోట్ల మంది ఉండగా, వీరిలో 2.9 కోట్ల మంది భారత్‌లోనే ఉన్నారు. భారత్ కంటే 7.9 కోట్ల హెపటైటిస్ బి రోగులతో చైనా ముందుంది. 2022 లోనే ప్ర పంచంలోని 187 దేశాల్లో హెపటైటిస్ కారణంగా కోటి 30 లక్షల మంది మృతి చెందారు. వీరిలో 87 శాతం మంది హెపటైటిస్ బి కారణంగా, 17 శాతం మంది హెపటైటిస్ సి కారణంగా చనిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ హెపటైటిస్ బి,సి కారణంగా 3500 మంది చనిపోతున్నారు. వీరిలో సగం మంది 30 ఏళ్ల నుంచి 54 ఏళ్ల లోపు వారు కాగా, 18 ఏళ్ల లోపు పిల్లలు 12 శాతం వరకు ఉన్నారు.
మొత్తం మృతుల్లో 55 శాతం మంది పురుషులు ఉన్నారు. హెపటైటిస్ సి కేసులు 2022 లో ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల వరకు నమోదయ్యాయి. వీరిలో 88 లక్షల మంది పాకిస్థాన్ లోనూ, 55 లక్షల మంది భారత్ లోనూ ఉన్నారు. మనదేశంలో ఆరోగ్య రంగంలో హెపటైటిస్ తీవ్రమైన సమస్యగా ఉంటోంది. కలుషిత సూదులు, లేదా రక్తం ద్వారా ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి సంక్రమిస్తుంది. దాదాపు పది దేశాల్లోని హెపటైటిస్ సి రోగుల్లో 80 శాతం మందికి ఆ వ్యాధి డ్రగ్స్‌ను వినియోగించే సూదుల ద్వారానే సంక్రమించింది. ఆ దేశాల్లో భారత్ ఒకటి. హెపటైటిఎస్‌పై అవగాహన లేకపోవడంతో హెపటైటిస్ అంటే కామెర్లు కదా అని , చిన్నపాటి మందులు, మూలికలు వాడితే నయమవుతుందని తేలికగా తీసుకొంటుంటారు. కొంతమంది రోగులైతే కనీసం రక్త పరీక్షలు చేయించుకోకుండానే చిన్నపాటి ఔషధాలను వాడుతుంటారు. తల్లుల నుంచి పిల్లలకు హెపటైటిస్ సంక్రమించడమనేది భారత్‌లో పెరుగుతోంది. అందువల్ల ప్రసవం అయిన వెంటనే ఈ వ్యాధిని నివారించడానికి పరీక్షలు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు.
హెపటైటిస్ ఎ, బి, సి, డి, ఇ రకాలేమైనా జ్వరం, ఆకలి తగ్గిపోవడం, డయేరియా, కామెర్లు , వాంతులు, పొత్తికడుపు నొప్పి, వంటి లక్షణాలు కొన్ని సాధారణంగానే ఉంటాయి. హెపటైటిస్ ఎ : దీనికి ప్రత్యేక చికిత్స అంటూ ఏదీ లేదు. వ్యాక్సిన్ తీసుకుంటే రక్షణ పొందవచ్చు. ఈ వ్యాధి సోకిన 14 నుంచి 28 రోజుల తరువాత లక్షణాలు బయటపడతాయి. హెపటైటిస్ బి : హె చ్‌ఐవీ కంటే ఈ వ్యాధి వందరెట్లు ఎక్కువగా సంక్రమిస్తుంది. ఆరేళ్ల లోపు పిల్లలకు ఈ వ్యాధి సోకితే మొండి రోగంగా మారే ప్రమాదం ఉంది. . పిల్లలు పుట్టగానే 24 గంటల్లోగా ఈవ్యాక్సిన్ ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. తరువాత 6,10,14 వారాలకు కూడా వ్యాక్సిన్ ఇప్పించాల్సి ఉంటుంది. హెపటైటిస్ సి: ప్రధానంగా రక్తం ద్వారా ఇది సంక్రమిస్తుంది. కొన్ని సందర్భాలలో లాలాజలం, వీర్యం, యోని ద్రవాల ద్వారా కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. వైరస్ ప్రవేశించిన 2 నుంచి 6 వారాల తరువాత ఈ వ్యాధి లక్షణాలు బ యటపడతాయి. ఇది మొండిగా మారితే డ్రగ్ థెరపీ చికిత్స అందిస్తారు. హెపటైటిస్ డి, ఇహెపటైటిస్ బి తో బాధపడే రోగుల్లో డి తిష్ఠ వేస్తుంది. హెపటైటిస్‌ఇ అనేది స్వల్ప ఆదా య దేశాల్లో ప్రబలంగా ఉంటోంది. నీటి సరఫరా, పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ అనేవి ఈ వ్యాధి నివారణకు కీలకాంశాలు.
వైరస్ సోకిన 2 నుంచి 10 వారాల తరువాత లక్షణాలు కనిపిస్తాయి. హెపటైటిస్ బీ,సీ రకాల రోగులకు ఉచితంగా మందులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2018లో ఓ పథకాన్ని ప్రారంభించింది. హెపటైటిస్ బి నివారణకు 1981లో మొదటిసారి అమెరికాలో వ్యాక్సిన్ ఆమోదం పొందింది. 1986లో మార్కెట్ లోకి వచ్చింది. 2014 నాటికి ఒక మోతాదుకు మొత్తం ధర 0.58 నుండి 13.20 డాలర్ల వరకు ఈ వ్యాక్సిన్ ధర ఉండడం గమనార్హం. హెపటైటిస్ ఎ, బి, ఇ నివారణ కో సం టీకాలు అందుబాటులో ఉన్నాయి. హెపటైటిస్ ఎ కు హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ ( ఐఐఎల్) సంస్థ హవిస్యూర్ అనే వ్యాక్సిన్‌ను తయారు చేయడం విశేషం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ హెపటైటిస్ ఎ వ్యాక్సిన్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకొంటున్నాం. ఈ నేపథ్యంలో స్వదేశీయంగా హవిస్యూర్ వ్యాక్సిన్ అందుబాటు లోకి రావడం ఆత్మనిర్భర్ భారత్ లక్షానికి సాక్షంగా చెప్పవచ్చు.
ఈ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలి. 12 నెలలు పూర్తి చేసుకున్న చిన్నారులకు మొదటి డోసు, మొదటి డోసు తీసుకున్న 6 నెలల తరువాత రెండో డోసు ఇవ్వాలని ఇమ్యునొలాజికల్ సం స్థ ప్రతినిధులు చెబుతున్నారు. హెపటైటిస్ ఇ వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్‌కు చైనాలో లైసెన్స్ పొందినా ఇంకా ఎక్కడా అందుబాటు లోకి రాలేదని తెలుస్తోంది. ఏదేమైనా ఈ హెపటైటిస్ గురించి ప్రజల్లో ఇంకా సరైన అవగాహన లేక పోవడంతో జ్వరం, వాంతులు, ఇతర లక్షణాలు ఏవి కనిపించినా తేలికగా తీసుకుంటున్నారు. సుదీర్ఘకాల అశ్రద్ధ వల్ల చివరకు ప్రాణాలే పోగొట్టుకొంటున్నారు.కొవిడ్ 19 వ్యాపించినప్పుడు మన ప్రభుత్వం తీసుకున్న చొరవ, అనుసరించిన విధానాలు ప్రపంచ దేశాల మెప్పును పొందగలిగాయి. అలాంటిది హెపటైటిస్‌ను నివారించడానికి ప్రయత్నించడం మన ప్రభుత్వానికి ఏమంత కష్టం గాదని చెప్పవచ్చు. అందువల్ల కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు ఈ వ్యాధిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించే క్యాంపైన్ చేపట్టడం తక్షణ కర్తవ్యం. అప్పుడే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన 2030 లక్షాన్ని నెరవేర్చడంలో మనం కీలక పాత్ర వహించగలుగుతాం.
డాక్టర్ బి. రామకృష్ణ
99599 32323
(నేడు హెపటైటిస్ డే సందర్భంగా)