హైదరాబాద్: మనిషి జీవితంలో కాలేయం ఒకటే ఉంటుందని దాని కాపాడుకోవాల్సిన అవసరాలన్ని గుర్తించాలని విరంచి ఆసుపత్రి డా. సాయి రవి శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ హైపటైటిస్ దినోత్సవం పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కాలేయానికి పెద్ద ప్రమాదకారిగా భావించబడే హెపటైటిస్ వైరస్‌తో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసం ఉందని తెలిపారు. ప్రజలందరూ ఎంతో ప్రాధాన్యత కలిగిన కాలేయంపై అవగాహన కలిపించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తమ ఆసుపత్రిలో ఉచిత వ్యాధి నిర్థారణ శిబిరం నిర్వహించి పలువురు రోగులు ఈ ఉచిత వ్యాధి నిర్థారణ పరీక్షలు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం డా. లతా ప్రసాద్, సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటీరియాలజిస్టు వివరిస్తూ హైపటైటిస్ వ్యాధి నివారణకు వ్యాక్సిన్ లు ఎంతో కాలంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సరైన సమయంలో నిపుణులైన వైద్యులు సూచించినట్లు ఈ వ్యాక్సిన్ లను అందరూ తీసుకోవాలని తద్వారా ప్రాణాంతకమైన హెపటైటిస్ వ్యాధి బారిన పడకుండా చూడవచ్చని తెలిపారు.
అంతే గాకుండా కాలేయం లేదా కడుపు లో ఏదైనా ఇబ్బంది వచ్చి అది దీర్ఘకాలంగా తగ్గకపోతే వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించి సరైన మందులు తీసుకోవడం ద్వారా కాలేయం పాడయ్యే స్థితికి చేరకుండా చూసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వి సత్యనారాయణ, డా. సురేష్ చంద్ర, డా. యం ఆర్ సి నాయుడు వారితో పాటూ పలువురు వైద్యులు, పారా మెడికల్, నర్సింగ్ సిబ్బంది, రోగులు పాల్గొన్నారు.