Thursday, January 23, 2025

ఇన్‌ఫెక్షన్లలతో హెపటైటిస్ సంక్రమణ

- Advertisement -
- Advertisement -

Hepatitis infection with infections on liver

ఈవ్యాధి సోకితే లివర్‌కు ఇబ్బందులు
ఈవైరస్ ఐదురకాలు ఉండి ఒకరి నుంచి ఒకరి వ్యాప్తిస్తుంది
కలుషిత నీరు, కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలి

హైదరాబాద్: మానవ శరీరంలో దాదాపు 500కు పైగా జీవన క్రియల్లో పాలు పంచుకునే ముఖ్యమైన అవయవంగా లివర్ చెప్పవచ్చుని వైద్యులు పేర్కొంటున్నారు. ఈలివర్ ప్రధానంగా జీర్ణ ప్రక్రియలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈలివర్‌ను ఇబ్బంది పెట్టే కొన్ని అంశాలలో హెపటైటిస్‌ను చెప్పవచ్చు. ఆరోగ్య అవగాహనలో హెపటైటీస్‌కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. హెపటైటిస్ అనేది లివర్‌కు ఏర్పడే ఒక ఇబ్బందిగా పేర్కొనవచ్చు. ఇది అనేక కారణాలతో ఏర్పడవచ్చు. ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్లు, ఆల్కహాల్ వంటి దురవాట్లు, కొన్ని రకాల జన్యుపరమైన లోపాలు. కొన్ని రకాల మందులను తీసుకోవడం వంటి కారణాలతోహెపటైటిస్ సంక్రమిస్తుందన్నారు. వీటిలో ముఖ్యమైనదిగా వైరస్ ఇన్‌ఫెక్షన్‌ల కారణంగా వచ్చే హెపటైటిస్‌ను గుర్తించుకోవాలని డా. ఆర్.వి. రాఘవేంద్రరావు చెబుతున్నారు. ప్రాథమికంగా హెపటైటిస్ అన్నది ఒక వైరస్‌తో వచ్చే లివర్ ఇబ్బంది. ఈవైరస్‌లో ఐదురకాలు కనిపిస్తాయి. వీటిని ఏ,బి,సి,డి, ఇ అనే రకాలుగా పేర్కొంటారు. ఇవి ఎక్కువగా ఒకరినుంచి ఒకరికి వ్యాపిస్తుంటాయి.

మానవ శరీరంలోకి ప్రవేశించాక క్రమంగా లివర్‌ను చేరుకుని అక్కడ ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తాయి. శరీరంలోని అనేక ముఖ్య విధుల్లో పాలు పంచుకునే లివర్‌లో ఈఇన్‌ఫెక్షన్ చేరటంతో అనేక రకాల సమస్యలు దారితీస్తాయని వెల్లడించారు. హెపటైటిస్‌లో హెపటైటిస్ ఏ, ఇ, అనేవి ఒకరి నుంచి ఒకరికి కలుషిత నీరు, కలుషిత ఆహారం ద్వారా సంక్రమిస్తుంటాయి. సాధారణంగా ఇటువంటి హెపటైటీస్ ఇబ్బందులు ఉంటే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తుంటాయి. ఒళ్లు నొప్పులు, తేలికపాటి జ్వరం, తలనొప్పి, శరీర బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ తరువాత 2,3 రోజుల్లో పచ్చకామెర్లు బయట పడతాయి. ఇది హెపటైటిస్ వైరస్ మూలంగా లివర్ కణజాలం దెబ్బతినడంతో సంభవించే పరిణామం. ఇక ఈవైరస్‌ను గుర్తించడం, నిర్దారించడం, చికిత్స వంటి అంశాలను తెలుసుకుందాం. చాలా సందర్భాల్లో సులభమైన ఎల్‌ఎఫ్ టీ వంటి రక్త పరీక్షల ద్వారా, సీరలాజికల్ పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. శరీరంలోని రోగనిరోధక వ్యవస్ద ద్వారానే అదుపులోకి వస్తుంది. కొన్ని అరుదైన సందర్భాల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న సందర్బాల్లో మాత్రం ఈహెపటైటిస్ ఏ, ఇ, వైరస్‌ల కారణంగా లివర్‌కు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడవచ్చు దీనిని పల్మనెంట్ హెపటైటిస్‌గా పిలుస్తారు. అప్పుడు రోగిని ఆసుపత్రుల్లో చేర్చటం, ఐసీయూలో చికిత్స చేయించడం వంటి చేపట్టాల్సి వస్తుంది.

లివర్ క్యాన్సర్:  హెపటైటిస్ ఇన్‌ఫెక్షన్లతో కలిగే ప్రమాదకర పరిస్దితి లివర్ క్యాన్సర్. లివర్‌లో అవాంచిత కణజాలం పేరుకుని పోయి కణితులుగా మారతాయి. సాధారణ కాలేయ క్యాన్సర్‌ను హెపటో సెల్యులార్ కాన్సర్ అంటారు. ఇది ప్రధానంగా దీర్ఘకాలికంగా ఆల్కహాల్ తీసుకునే వారిలో ఏర్పడుతుంది. హెపటైటిస్ బి, సి, ఇన్‌ఫెక్షన్‌తో ఏర్పడవచ్చన్నారు. వీటిలో మైక్రోవేవ్ అబ్లేషన్ అన్నది చాలా మెరుగైన చికిత్స విధానం, క్యాన్సర్ మొదటి దశల్లో చక్కటి చికిత్స విధానాలతో రోగిని కాపాడవచ్చు. ఒక వేళ వ్యాధి బాగా ముదిరిపోయినప్పటికి, అధునాతన మార్గాలను అవలంబించటం ద్వారా నాణ్యమైన శేష జీవితాన్ని అందించేందుకు వీలైతుంది. తీవ్రమైన హెపటైటిస్ రోగులలో అవసరాన్ని బట్టి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాల్సి వస్తుందని తెలిపారు.

రోగులకు అవగాహన ముఖ్యం:  ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా చికిత్సలు తీసుకోవడం అవసరం. మందులతో లేదంటే సర్జికల్ విధానాలతో చికిత్సలు అందించేందుకు అవకాశం ఉంటుంది. ఆధునిక టెక్నాలజీతో కూడిన వసతులు, నిపుణులైన వైద్యులను కలిగిన ఆసుపత్రులను సంప్రదించడం మేలు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత త్వరగా సమస్యను గుర్తిస్తే అంత త్వరగా చికిత్సలు ప్రారంభం అవుతాయి. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఆధునాతన విధానాలు అవలంబిస్తే హెపటైటిస్ మహమ్మారిని తరిమికొట్టడం పెద్ద కష్టమేమి కాదన్నారు. సాధ్యమైనంత వరకు హెపటైటిస్ వైరస్ రాకుండా జాగ్రత్త పడటం మేలు. వ్యక్తిగత శుభ్రత పాటించడం, కలుషిత నీటి, కలుషిత ఆహారానికి దూరంగా ఉండటంతో రక్షణ పొందవచ్చు. కాచి చల్లార్చిన నీటిని తాగడం ఉత్తమ మార్గం. రక్త మార్పిడి వంటి చోట్ల జాగ్రత్త తీసుకోవడం అవసరం. హెపటైటిస్ బి వంటి వైరస్‌ల నుంచి రక్షణ పొందేందుకు టీకాలు లభిస్తాయి. అందుచేత హెపటైటిస్ పట్ల అవగాహన, అప్రమత్తతో ఉంటే సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News