Saturday, April 5, 2025

పాన్ ఇండియా స్టార్‌తో మరోసారి..

- Advertisement -
- Advertisement -

దిశా పటాని అంటే అందాల ఆరబోతకి కేరాఫ్. ఆమె ఇన్ స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే ఒద్దికగా, పొందికగా ఉన్న ఒక్క ఫోటో కనిపించదు. అందాల ఆరబోత వల్ల ఆమెకి ఇన్‌స్టాలో ఫాలోవర్స్ పెరుగుతున్నారు. యాడ్స్ బాగా వస్తున్నాయి. ఈవెంట్స్‌లో డ్యాన్స్ పెర్ఫార్మన్స్ కోసం ఆఫర్లు ఒళ్ళో వాలుతున్నాయి. దాంతో పాటు కోట్ల రాబడి అకౌంట్లో పడుతోంది. కానీ అసలైన సినిమా ఆఫర్లు మాత్రం రావడం లేదు. ఆమె గతేడాది ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898ఎడి చిత్రంలో నటించింది. అందులో ప్రభాస్ సరసన కనిపించింది. అంత పెద్ద హిట్ తర్వాత కూడా ఆమెకి బాలీవుడ్‌లో ఒక్కటంటే ఒక్క మూవీ ఆఫర్ రాలేదు. తాజాగా మరోసారి ఆమెకి ప్రభాస్ సరసన నటించే అవకాశం వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి ఒక చిత్రం రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో కొత్త భామ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఒక కీలకమైన పాత్రకి దిశని తీసుకోవాలని భావిస్తున్నారట.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News