Monday, December 23, 2024

ఇక సైలెంట్ మోడ్..

- Advertisement -
- Advertisement -

ముగిసిన ప్రచారం.. తగ్గిన సందడి

ఆగిన మైకులు.. ప్రచార రథాలు.. పాటల హోరు

అమల్లోకి వచ్చిన 144వ సెక్షన్ 48గంటల పాటు మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాల మూసివేత

హస్తిన చేరిన జాతీయ పార్టీల అగ్రనేతలు
96 సభల్లో కెసిఆర్ ప్రసంగం

ఎనిమిది సభల్లో ప్రధాని మోడీ, 87 సభల్లో రేవంత్

హైదరాబాద్‌లో నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవు

మన తెలం-గాణ/హైదరాబాద్: తెలంగాణ లో ఎన్నికల ప్రచార పర్వానికి మంగళవారం సాయంత్రం తెరపడింది. నామినేషన్ల ఉపసంహరణ అభ్యర్థుల ఖరారు తరువాత బరిలో ని లిచిన అభ్యర్థులు హోరెత్తించిన మైకులు బంద్ అయ్యాయి. రాజకీయ నాయకుల ప్రచార ర థాలు, పార్టీల పాటలు ఎక్కడిక్కడ అగిపోయా యి. చివరి అంకానికి తెర లేపిన అభ్యర్థులు సైలెంట్‌గా ప్రచారం చేస్తూ నగదు, మద్యం పంపిణీ చేసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల అధికారుల కనుగప్పి తాయిలాలు పంచేందుకు ఎత్తులు వేస్తున్నారు. శాసనసభ ఎన్నికలకు ఈనెల 3వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. 10 వరకు నామినేషన్ల స మర్పణ, 13 తేదీన పరిశీలన, 15వ తేదీన అ భ్యర్థుల ఉపసంహరణతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.

బిఆర్‌ఎస్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బిజెపిలు అట్టహాసంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. మజ్లిస్, బిఎస్‌పి, వామపక్షాలు సహా ఇ తర పార్టీలు, స్వతంత్రులు ఎన్నికల ప్రచారా న్ని తమదైన శైలిలో చేపట్టారు. ఆయా పార్టీల తరపున అగ్రనేతలు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార స భలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలలో పాల్గొన్ని ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు హామీల వర్షం కురిపించడంతో పాటు తమ పార్టీ విధానాలను ప్రజలకు వివరిస్తూ, ప్రత్యర్థుల వైఖరిని ఎండగడుతూ ప్రచారంలో పరుగులు పెట్టారు. విమర్శలు, ప్రతివిమర్శలతో ఎన్నికల క్షేత్రం రణరంగంగా తలపించింది. ఆయా పార్టీలు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అభ్యర్థులు ప్రయత్నం చేశారు. ఎన్నికల అధికారులు పో లింగ్‌కు 48 గంటలకు ముందే ప్రచారానికి అనుమతి ఉందని తరువాత చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించడంతో బస్తీలు, గ్రామాల్లో ఒక్కసారిగా సందడి తగ్గింది. ఎన్నికల ప్రచారానికి ముగిసిన వెంటనే 144 సెక్షన్ అమల్లోకి వ చ్చింది. రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు మూత పడ్డాయి.

ప్రచారానికి తరలివచ్చిన అగ్రనేతలు
తెలంగాణ ఎన్నికలను బిఆర్‌ఎస్, కాంగ్రెస్, కమలనాథులు చాలెంజ్‌గా తీసుకుని హస్తిన నుంచి పార్టీ పెద్దలు ప్రచారానికి పెద్ద సంఖ్య లో దిగారు. ఈనెల 24వ తేదీ నుంచి 28 వర కు పలు నియోజకవర్గాల్లో బహిరంగసభలు, స్థానికులతో సమావేశాలు, రోడ్‌షోలు నిర్వహించారు. అన్ని పార్టీల ముందుగా బిఆర్‌ఎస్ చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రజా ఆశ్వీరాద సభలు ప్రారంభించి 10 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 96 బహిరంగ సభలు నిర్వహించి రికార్డు సాధించారు.

అదే విధంగా బిజెపి తరుపున ప్రధాని నరేంద్ర మోడీ 8 సభలు, కేంద్రమంత్రి అమిత్‌షా 21, పార్టీ చీప్ జెపి నడ్డా 12, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్‌సింగ్ 06, యూపీ సిఎం యోగి అదిత్యనాథ్ 08 సభల్లో పాల్గొన్నారు. అదే విధంగా కాంగ్రెస్ నుంచి టిపిసిసి చీప్ రేవంత్‌రెడ్డి 87 సభలు, రాహుల్ గాందీ 23, ప్రియాంక గాంధీ 26, ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే 10, కర్నాటక సిఎం సిద్ద రామయ్య 3, చత్తీస్‌గడ్ సిఎం భూపేష్ బాగేల్ 04 సభల్లో పాల్గొన్నారు. అగ్రనేతల రాకతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఊపు వచ్చిందని రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు.

నగదు పంపిణీకీ సర్వం సిద్ధం
ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు సర్వ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. డబ్బు, మద్యం, తాయిలాలు పంపిణీ చేసి ఓటర్ల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు డబ్బుల సంచులను అనుచరులు వద్దకు చేరవేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుండి రహదారులపై అక్రమంగా తరలిస్తున్న డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయినా ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఓటర్లను ప్రభావితం చేసేందుకు అవసరమైన తాయిలాలు ఇప్పటికే సమకూర్చుకున్నట్లు సర్వత్రా చర్చ జరుగుతోంది. తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల ద్వారా అవసరమైన మేరకు ఇప్పటికే తరలించి పోలింగ్ సమయానికి ఐదు గంటల ముందు పంపిణీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News